6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

సమర ప్రభోదం


అది ౧౯౬౨, భారత వుత్తర సరి హద్దులలో వుద్రిక్త పరిస్థితి.చైనా దురాక్రమణ కు సిద్ధపడింది.భారత భూ భాగాలను దౌర్జన్జంగా ఆక్రమించింది . నెహ్రూ గారు సంప్రదింపుల ద్వారా పర్స్కరించాలని ప్రయత్నం చేసారు. చైనా అద్యక్షులు శ్రీ మావో -సే - టుంగ్ తోను చైనా ప్రధాని చౌ -యెన్ -లై తోను ,సంప్రదింపులు జరిపి ఒక అంగీకారానికి వచ్చిమాక్-మోహన్ లైన్ అనే సరహద్దు ఒప్పందం చేసుకున్దామను కుని వూపిరి పీల్చుకున్నతరువాత అకస్మాత్తుగా మన సేనలు సిద్ధంగా లేనప్పుడు కుస్చిత యుద్ధ తంత్రంతో మన భూభాగం లో చాలా ముందుకు చొచ్చుకు వచ్చారు.సంప్రదింపులు మధ్య వర్తిత్వాలు అన్ని విఫలం అయ్యాయి.ఆ సమయంలో యుధం తప్పలేదు.పోరు ప్రారంభమైంది.ఇరు సేనలు అత్యాధునిక విమానాలతోను ఆయుదాలతోనూ పరస్పర దాడులు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రపంచ దేశాలన్నీ మన దేశానికిఅండ ప్రకటించాయి.
పేపర్లు ,రేడియోలు ద్వారా వార్తలు అందేవి . రేడియోలు ఎక్కడో ఒక ఇంట్లో వుండేవి ,సామాజిక రేడియో గ్రామ పంచాయతి లో ప్రజలకి అందుబాటులో వుండేది .ఏ ఊరికి విద్యుత్తు వుండేది కాదు, .....రేడియో, బాటరీ తో పని చేసేది. ఆ బాటరీ కూడా చాలా పెద్దగా వుండేది .ఇద్దరు మనుషులు పట్టి మొయ్యాల్సినంత పెద్దది అన్నమాట.
ఇళ్ళల్లో కిరసనాయిలు దీపాలే. వీధి దీపాలు కూడా అవే.ఆ రోజుల్లో పట్టణాలలోనూ ,కొన్ని గ్రామాల్లోను , నగరాల్లో వీధి దీపాలకు ,కొద్ది మంది ధనవంతుల ఇళ్ళకు తప్ప కరెంటు అందు బాటులో వుండేది కాదు.వూళ్ళల్లో వీధి దీపాలకు కిరసనాయిలు వాడేవారు.
కాని మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో ఒక్క మానికొండ అనే గ్రామంలో ఎవరింట్లోనో జెనరేటర్ తో కరెంటు కొన్న విషయం మీద ,అందరు ఆశ్చర్యంగా చర్చించు కొనే వారు. . (౧౦౬౨ నాటికి గ్రామాల స్థితి గతులు మీకు టూకీగా చెప్పాలనే తపన తో ఈ ప్రస్తావన.)ఇక అసలు విషయానికి వద్దాం.

వూళ్ళో రేడియోలో వార్తలు వచ్చే సమయంలో గ్రామ పంచాయతి ఆఫీసు వద్ద ప్రజలు గుమి గూడి వార్తలు, విశ్లేషణలు వినే వారు. పరిస్థితిని చర్చించే వారు.పరిస్థతి అవగాహన చేసుకొనే వారు.సినిమా హాళ్లల్లో యుద్ధ ప్రాంత దృశ్యాలు ప్రదర్శించే వారు.అప్పటి ప్రధాని పండిట్ జవహరలాల్ నెహ్రూ వుపన్యాసాలు కూడా సినిమా హాళ్లల్లో ప్రదర్శించే వారు.ఆ వార్తా చిత్రాలు సినిమా కు వచ్చిన వారి నందరిని వుత్తేజ పరిచేవి. చూసే యువతని మరీ చైతన్య పరిచేవి . సైన్యంలో చేరేందుకు యువత వరుసలు కట్టారు.
విద్యార్థులు,వుద్యోగులు , నటులు ,పత్రికల వారు , ఒకరని కాదు అందరు అన్ని వర్గాల వారు ,స్త్రీలతో సహా దేశ రక్షణ నిధి పోగు చేసి ప్రభుత్వానికి అందచేసారు. రాజకీయాలకతీతంగా , సైనికులకు కావలిసిన డబ్బును, వస్తువులను బట్టలను ,వున్ని దుస్తులను సమకూర్చారు.దేశమంతా ఒక్క తాటి పైన నిలచిన ఆ సందర్భం లో ,....

ఆ సమయంలో నేను కృష్ణ జిల్లా వుంగుటూరు లో వుండి చడువుకొంటున్నాను. ఆ వూళ్ళోని మా హై స్కూల్లో (నేను విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శి పదవి లో వుండేవాడిని )విద్యార్థులు అందరిని కూడగట్టి దేశ రక్షణ నిధి కొరకై విరాళాలు సమకూర్చే భాద్యతని నేను తీసుకోవడం జరిగింది.శ్రమదానం ద్వారా ఆ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాము.
విద్యార్థులతో దేశ రక్షణ నిధిని సమకూర్చే విషయమై సంప్రదించి వారి అందరి అనుమతిని పొందిన తరు వాత , మా ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.యస్ .రా వు గారికి మా అభిప్రాయం తెలియ చేసి నిధికి చందాలు ఎట్లా కూడగాట్టాలనే విషయ మై చర్చించాం. వూళో చందాలు వసూలు చేదామని ఆయన సలహా ఇచ్చారు. నేనేమో మా వ్యూహం తెలియజేసి మేము శ్రమ దానం ద్వారా వరి చేలు కోసి తద్వారా వచ్చిన మొత్తాన్ని దేశ రక్షణ నిధికి పంపాలనే (శ్రమ దాన కార్య క్రమంలో వారి చేలు కోయద మనే మాట అప్పుదికప్పుడు నేను తీసుకొని ప్రతిపాదించిన నిర్ణయం.)మా సంకల్పం ఆయనకు చెప్పాను.. ఆ ప్రతి పాదన ఆయనకు చాలా బాగా నచ్చింది..
ఆ ఆ రోజుల్లో స్కూలు విద్యార్థులు ఎవరికీ పాద రక్షలు వుండేవి కావు.అది కాక ఒక్క స్కూల్లో తోటపని చేసిన అనుభవం తప్ప ఏ వక్క విద్యార్థికి పొలం పనులు చేసిన అనుభవం లేదు ..ఆటకాయ తనంగా చేలల్లోనూ చేలగట్ల మీద ,బురద నేలలలోను తిరిగిన అనుభవం తప్ప.
(ఆ రోజుల్లో ఆ వూర్లో కంకర రోడ్లు కూడా వుండేవి కాదు.ఇప్పుడైతే సిమెంటు రోడ్లు వున్నాయి అనుకోండి .)
అప్పట్లో వర్షాకాలంలో మోకాటి లోతు బురద లో వెళ్ళాల్సి వచ్చేది. చెంబట్టుకొని కూడా అట్లా వెళ్లాలిసిందే మరి. వర్షా కాలంలో భయంకరంగా వుండేది. స్త్రీలు చాలా ఇబ్బంది పడే వారు.మరుగు దొడ్లు వుందేయి కాదు మరి. (ఇది మరీ అప్రస్తుతం అనిపించినా .....ఈ వ్యాసానికి అవసరమే).
డబ్బులుగా సేకరించ కుండా ,శ్రమ దానం ద్వారా , అదే నండీ ,విద్యార్తులందరం పని చేసి త ద్వారా వచ్చే శ్రమ ఫలితాన్ని నిధికి ఇచ్చే విధానాన్ని ఎన్నుకొని , కనీసం ఇరవై ఎకరాల మాగాణి కోత కోసి వచ్చిన డబ్బులు, దేశ రక్షణ నిధికి ఇవ్వాలని నిర్ణయించాం కదా ..
ఆ నిర్ణయం సరియినదేనా? ,పిల్లలు పంట పాడు కాకుండా చేతులు కాళ్ళు కోసుకోకుండా కోత కోయ గలరా?, వంటి అనేక సందేహాలు టీచర్ల లోను,మా ఊరి పెద్దల లోను తలెత్తాయి .ఆ విషయ మై చాల చర్చ జరిగింది. నల్గురు కలిసి ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలంటే అది ఎంత మంచి పనైనా ఒక గాట్లో పడటం అంత తేలిక అయిన విషయం కాదు.నాగలికి కట్టిన ఎడ్లు ఒకటి అటు ఇంకోటిటు, లాగితే దుక్కి సాగుతుందా ?ఊళ్ళో గ్రూపులుంటాయి కదామరి. దానితో రాజకీయాలూ తప్పవు.నాకు రాజకీయం లో బలపం పట్టు కోవడం అప్పుడే తెలిసిందనుకోండి.
ఊరి పెద్దల్ని ఒప్పించే భాద్యత ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.యస్ మూర్తి గారు , డ్రిల్లు మాస్టారు విష్ణు గారు తీసుకొని ,ఊరి పెద్దల్ని వప్పించారు. వారందరికీ మేము ప్రతి పాదించిన ప్రయోగం నచ్చింది. ముందు పది ఎకరాలు వరి పొలం ఒక కామందు (మా స్కూలు ప్రక్కనే)కోతకు ఇచ్చాడు... పెద్ద రైతుల దగ్గర కొడవళ్ళు తెచ్చుకొని , మొత్తానికి వరి కొత కోసాము. ఒక రకమైన తృప్తి,ఆత్మా విశ్వాసం మా అందరిలో.

అందరు ఊపిరి పీల్చుకొన్నారు. వరి పాడు కాకుండా కోసారనీ ఎటువంటి గాయాలు కాకుండా పని అయిందని,పెసర జనుము విత్తనాల తొక్కిడి కూడా బాగా అయ్యిందని,ప్రచారం జరిగి, మా చేలు కూడా కోయండి అని మరి కొందరు ముందుకొచ్చారు.మరో రోజు ఆ చేలు కూడా కోసాం . ఎవరికీ కూడా చేతులు గాని ,కాళ్ళు గాని తెగలేదు.ఎప్పుడు కొడవలి పట్టిన చేతులు కాదాయె.మొత్తానికి మా అందరికి పొలం పని మీద వుత్సాహం కలిగింది.అప్పటి వరకు వూళ్ళో వర్షాకాలంలో బురదలో తిరిగిన అనుభవం బాగా వుపయోగ పడింది.పిల్లలందరికీ జలగల గురించి ,నీళ్ళ కట్టే పాముల గురిచి,ఎన్ద్ర కాయల గురించి భయాలున్దేవి, అయినా ధైర్యంగా ముందుకొచ్చారు, ఆ సందర్భంలో వాళ్లు చెప్పిన విషయం మీ అందరితోనూ పంచుకు తీరాలి. అట్లా గయితే రోజు వారీ కూలీలు కూడా భయపడాలి కదా . వాళ్లకు లేని భయం మనకెందుకు?అని. వాళ్ల ధైర్యానికి ఆలోచనా విధానానికి నేను చాలా అఛెరువన్దాను.
కోత కోయగా వచ్చిన మొత్తం : రూ :౧౪౦౦-౦౦ రక్షణ నిధికి పంపాము. ఈ విధంగా శ్రమదానం ద్వారా నిధి సమకూర్చుకొన్న విధానం ,పంట చేలు చక్కగా కోసిన పధ్ధతి అందరి మెప్పును పొందాయి .అప్పటివరకు పిల్లలు పంట పాడు చేస్తారేమోనని భయపడ్డారు .దిన పత్రికల్లో అభినందన పూర్వక వార్త లు వచ్చాయి .అప్పటి రోజుల్లో మయా గురించి మా స్కూలు గురిచి ,అందరూ చాలా గొప్పగా చెప్పుకున్న సందర్భాలున్దేవి.

ఆ కార్యక్రమంలో పాలు పంచుకొన్న విద్యార్ధులను ప్రోత్స హించేందుకు నేను వ్రాసి ,పాడిన దేశ భక్తి ప్రబోధ గేయం ఇది .
ఆ సందర్భంలో మా వుత్శాహాన్ని ప్రోత్సహించి ,సహకరించిన అప్పటి హెడ్ మాస్టర్ శ్రీ పి.యస్ .మూర్తి గారు , ఇతర టీచర్లు ,ఊరి పెద్దలు, పాల్గొన్న తోటి విద్యార్థులు ఎంతగానో అభినందనీయులు.


దేశ భక్తి ప్రభోధ గేయం

కదలు కదలు కదలరా కదన భూమి కరుగారా

హిందూ దేశ వీర పౌర భరత మాత తనయుడా

వీర ధీర శూర పురుష భారత సేన సైనికుడా

నీదు భూమి భరతావని ఒక్క అంగుళం అయినను

అన్యుల కై ఒసగమని ప్రతిన చేయ రమ్మురా

మిత్రులని నమ్మితేను మిత్ర ద్రోహం చేసారు

శత్రులతో తలపడగా శ్రద్ధ తోను కదలరా

దుర్మార్గుల దునిమివేయ ధైర్యం తో సాగరా

భయం వదులు జయం కలుగు ధైర్యంతో ..

కదలు కదలు కదలరా కదన భూమి కరుగారా .

రచయిత ,గేయకారుడు :నూతక్కి రాఘవేంద్ర రావు . గేయ రచన :౧౯౬౨ జనవరి
ప్రచురణ తేది :౦౬-౦౨-2009

కామెంట్‌లు లేవు: