5, ఏప్రిల్ 2009, ఆదివారం

తెంపరి

తెంపరి

భయంకర యంత్ర దంష్ట్రాలతో

భయభీకర రసాయనాలతో

ప్రాణాంతక విష వాయువులతో

విష సర్ప సదృశ విద్యుద్ఘాతాలతో

క్షణ క్షణం భయం భయం

ఒక్క క్షణం నిశ్శబ్దం

మరుక్షణం భయ భయ భీకర గర్జన

మసలుతున్న మరుగుతున్న

ద్రవ లోహపు ప్రేలుళ్ళవి

లోహ ప్రవాహాలను మాలుపుకొంటూ

ఘన లోహాలను మలచుకొంటూ

చెలిమి బాట వేసు కొంటూ

యంత్రాలను నియంత్రిస్తూ

రసాయనాయలను నియంత్రిస్తూ

విషవాయువులకు వేణువులూదుతూ

విద్యుద్ఘాతాల వీపు నిమురుతూ

దారి చూపు ఆ మనిషే

కార్మికుడు కష్ట జీవి

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది: ౦౭-౦౪-2009

1, ఏప్రిల్ 2009, బుధవారం

అభ్యుదయం

నిశ్చలంగా మనసు
యోజనాలు పయనిస్తే
నిరంతరం సంచలిస్తూ
హ్రుదయం
యేకప్రాంత వాసిని
మనసుపొరలలో
జనిస్తుంది వుద్రేకం
హృదయాంత రాళాలలో
వుద్భవిస్తుంది వుద్వేగం
చంచల భావ జనిత వుద్రేకం
అచంచల భావోద్భవ
వుద్వేగాన్ని అధిరోహించి
సవారి చేసే అవకాశం
ఇవ్వ బోకు రానివ్వ బోకు
వుద్వేగాన్ని ఆవహింప చేసుకో
వుద్రేకాన్ని ఆవలికి నెట్టు
అదే అభ్యుదయం
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు, తేది:02-04-09