1, అక్టోబర్ 2009, గురువారం

తొట్రుపాటు

తొట్రుపాటు
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:27-09-2009
కాబోలది గగురుపాటు
కాబోలును జలదరింపు
కాబోలును కాబోలును
ఆ తనువున పులకరింపు
యుగ యుగాల నిద్ర నుంచి
ఆవులించి వళ్ళువిరచి
మత్తు మత్తుగా
మరల పవ్వళించినట్లు
అదియంతా క్షణకాలపు
ఆ నిద్దురలేని చేష్ట
కాలపురుష ప్రియుడిచ్చిన
ఆనందపు అనుభూతులు
హ్రుదికొనలో రగిలించిన
తొట్రు పాటుకావచ్చును

5, ఏప్రిల్ 2009, ఆదివారం

తెంపరి

తెంపరి

భయంకర యంత్ర దంష్ట్రాలతో

భయభీకర రసాయనాలతో

ప్రాణాంతక విష వాయువులతో

విష సర్ప సదృశ విద్యుద్ఘాతాలతో

క్షణ క్షణం భయం భయం

ఒక్క క్షణం నిశ్శబ్దం

మరుక్షణం భయ భయ భీకర గర్జన

మసలుతున్న మరుగుతున్న

ద్రవ లోహపు ప్రేలుళ్ళవి

లోహ ప్రవాహాలను మాలుపుకొంటూ

ఘన లోహాలను మలచుకొంటూ

చెలిమి బాట వేసు కొంటూ

యంత్రాలను నియంత్రిస్తూ

రసాయనాయలను నియంత్రిస్తూ

విషవాయువులకు వేణువులూదుతూ

విద్యుద్ఘాతాల వీపు నిమురుతూ

దారి చూపు ఆ మనిషే

కార్మికుడు కష్ట జీవి

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది: ౦౭-౦౪-2009

1, ఏప్రిల్ 2009, బుధవారం

అభ్యుదయం

నిశ్చలంగా మనసు
యోజనాలు పయనిస్తే
నిరంతరం సంచలిస్తూ
హ్రుదయం
యేకప్రాంత వాసిని
మనసుపొరలలో
జనిస్తుంది వుద్రేకం
హృదయాంత రాళాలలో
వుద్భవిస్తుంది వుద్వేగం
చంచల భావ జనిత వుద్రేకం
అచంచల భావోద్భవ
వుద్వేగాన్ని అధిరోహించి
సవారి చేసే అవకాశం
ఇవ్వ బోకు రానివ్వ బోకు
వుద్వేగాన్ని ఆవహింప చేసుకో
వుద్రేకాన్ని ఆవలికి నెట్టు
అదే అభ్యుదయం
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు, తేది:02-04-09

8, మార్చి 2009, ఆదివారం

భాషా నిధనం ...సుస్వాగతం

మహొత్క్రుష్త మాత్రు భాషా నిధన కార్యక్రమం
.. సుస్వాగతం ..
రచన :నూతక్కి రాఘవెంద్ర రవు.
తెది 04-03-2009


ఈ భూమి పై పుట్టిన ప్రతి మనిషి , మానవ సమాజంలొ పెరిగే ప్రతి వ్యక్తికి ఆ సమాజపు భాష ,తద్వారా జీవన ప్రక్రియలొ జీర్నిచుకుపొయిన సంప్రదాయాలు,సంస్క్రుతులు,అలవాటులు ,ఆ జాతి జీవన చరితకు నిలువెత్తు దర్పణాలు.

సమాజానికి సంస్క్రుతి ,సంప్రదాయాలు ,రెందు నిట్టాళ్ళ లాటివివైతె .నీతి,నైపున్యం, నిబధత,ఆకాంక్ష అన్నవి నాలుగు మూల స్థభాలు. యీ భూమి పై మానవుడు సుఖంగ బ్రతకడానికి ముఖ్యంగ కావలసినవి,తింటానికి తిండి,కట్టుకోంద్కూ బట్ట,ఎండ, వానల నుంచి, జంతు జాలం నుంచి,రక్షణకై గూడు ,ఒకరి నుంచి ఒకరు అబిప్రాయాలు తెలుసుకొవడానికి సంకేతాలు ,సంకేతాలనుండి చేతి సఙ్గ్నలు,శబ్ద సంకేతాలు,ఆ శబ్ద సంకేతాలనుండి పదాలు,వాటి ద్వారా వాక్యాలు ,తద్వారా అక్షరాలు,మాటలు ,భాష,సంభాషణ,అక్కడితొ ఆగకుండా ,వ్రాత,రచన, సాహిత్యం,....ఆ విధంగా ,ఒక జాతి సంస్కృతి పై భాష,చాలా ప్రముఖ పాత్ర పొషిస్తుంది .

భాష సమాజాన్ని శాసిస్తుంది,భాష సమాజాన్ని పాలిస్తుంది, భాష సమాజాన్ని నియంత్రిస్తుంది ,భాష సమాజాన్ని బుజ్జగిస్తుంది,భాష సమాజాన్ని ప్రశ్నిస్తుంది,భాషే ప్రపంచాన్ని చూపిస్తుంది, వినిపిస్తుంది,ఆలోచింప చేస్తుంది .

భాష మానవునికి వున్న మహాధ్భుత వరం ,సౌకర్యం,మరి యే యితర జీవ రాశికి లేదన్న వాస్థవం మనందరకు తెలిసిన విషయమె,భాష పై అధి కారం సాధించిన వాళ్ళ్లు యే రంగంలోనయినా తమ దంటూ ఒక ప్రత్యేక స్థానం పొందగలుగుతారు.యే భాష పైనైనా అధికారం పొందగలిగిన వాడు తన మాత్రు భాషపై గొప్ప చాతుర్యం వున్న వాడై వుంటాడు.లెదా అదె భాషలొ బాల్యం నుంచి సాధన చేసైనా వుండి వుండాలి.

కాబట్టి మాత్రు భాషలొ ప్రావీన్యం వున్న తరువాతనె యే యితర భాషలయినా నేర్చు కొవచ్చు.అభిమానించ వచ్చు .జీవన అవసరార్థం వినియొగించుకొవచ్చు.మాత్రు భాష అంటె మాటొ వ్రాతో ఒక్కటొ,రెందో కాదు, సంప్రదాయానికి , సంస్క్రుతికి అనుసంధానించబడిన ఒక మహత్తర ప్రక్రియ.
మాత్రు భాష అలవడలేదంటే, ఆ సమాజంతో ఆమనిషికి సంపర్కం లేదన్న మాటె. అంతగా భాషా,సంప్రదాయం, సంస్క్రుతి, జీవన విధాన్నాల్లో ముప్పిరిగా పెన వెసుకు పోయి వుంటాయి.

తమ తమ సంస్క్రుతి సంప్రదాయాలు,సామాజిక విధి విధానాలు,తర తరాలకు అందించే భాధ్యత ఆ సమాజంలొ జన్మించిన ప్రతి ఒక్కరిది.దానికై సమాజంలొ గట్టి అనుబంధం అవసరం. ఆ అంబంధం ఆ సమాజంతొ యెవరూ విదదీయ లేరు.
అప్పుడే మాత్రు భాషపై పట్టు కలుగుతుంది ,సంస్క్రుతి సంప్రదాయాల యడల భక్తి కలుగుతుంది.తనకంటూ జీవన యానంలొ ఒక వునికి యేర్పడుతుంది. ఒక వ్యక్తిత్వం యెర్పదుతుంది.
యీ రొజున మాత్రు భాషాభిమానం ప్రజజీవనంలొ తరిగి పొతున్నదని పొలి కేకలు పెట్టే వాళ్ళే గాని,దానికి మూల కారణ మేమై వుంటుందన్న విషయమై ఆలొచించారా ఎన్నడయినా?

ఖుక్షి యనె రెందక్షరాల జీవ జాల యంత్రాంగం, మానవ జాతిని శాసిస్తున్నప్పుదు ,దాని అవసరాలు తీర్చే ప్రక్రియలొ మానవుడు యెన్నొ యెన్నెన్నొ
యత్నాలు, సాధనలు చేస్తూనే వుంటాడు.ఆకలి, పేదరికం, క్షుధ్భాధ వాటినివారనోపాయం వెదికే యత్నంలొ వుత్పాదితమయిన పరభాషా వ్యామొహాలు.అందునుంచి వుధ్భవించినవే భారత దేశంలో పరమత అభిమానాలు. అధికార యంత్రాంగాలు, తమ అధికారం నిలుపుకొనేందుకు చేసె మంత్రాంగాలు ప్రక్కన బెట్టి యీ సమస్యా మూలాల గూర్చి ఆలొచిస్థే పరిష్కారానికి మూలం తెలుసుకొని ఆ కోణంనుంచి సామాన్యలకు వుపశమనం దొరికినప్పుడు, అప్పుడు వాళ్ళు మాత్రు భాషపై ద్రుష్టి మరల్చె అవకాసం వుంటుంది.

ఆదీ కాకుందా చాందస భావాల మధ్య ,చందొ బధ్ధ బంధనాలలొ భాష యెప్పుడొ బందీ అయిపొయింది. ధనవంతులు,విద్యా వంతులు యే ప్రాంతంలొని వారయినా మాత్రు భాష మాట్లాడటమే తప్పుగా భావించడం ప్రారంభమయి యెన్నో దశాబ్దాలయి పొయింది.

ఇక యే పండితు డయినా ఆయా ప్రాంతాలలొ మాత్రు భాషను వెదకాలంటె ఆ మహా రాజ పొషకులు,భాషామ తల్లికి ముడ్డు బిడ్డలు వారే వారే, పేదలు నిరుపేదలు, సామాన్యులు,చదువు కోనివారు చదువుకొన లేని వారు,గుడిసెల్లొ , రొడ్లవెంబడి,కాలవ గట్లన మురికివాదలొ, ఎక్కడ బడితె అక్కడ వారె.... ,వారికి మాత్రు భాష తప్ప మరే భాషా రాదు. వారు మాత్రు భాషా ద్రొహం చేయలేరు.వారికి పేదరికం లో కొట్టు మిట్టాడటమే తెలుసు.వారే దేశం లో అత్యధికులు. వారి వల్లనే భారత దేశంలొ ఆయా మాత్రు భాషలు బ్రదుకు నీడుస్తున్నాయి.


ఆయ్యా! మాత్రు భాషాభి మ్రానుల్లారా,భాషా పందిత ప్రవరాఖ్యుల్లారా,భాషా ఛాందస వాద కుయుక్తుల్లారా......

ఒహొ ఇందులొ మీదే కద ప్రధమ భాగం ఒ రజకీయులారా ....
వొటే మీ భాష ఒటే మీ మాట ఒటే మీ బ్రతుకు ఒటే మీ ఉశ్చం
నీచం,ఒటే మీ తుస్చ జీవనం.అయినా ఆఆ భాషలొనే పుత్తి, ఆ భాషా జన జీవనాల బక్షిస్తూ బ్రథికేసే రాజకీయ ......విష చత్ర చాయలో... .


మాత్రు భాషా నిధనానికై ప్రతిగ్న చేసినట్లున్నాయి ప్రభుత్వాలు .
ఖాల్మొక్త బాంచ్న్ దొరా
మేమే బాబూ బాస బతికించేది,
మాకూ తిండి ,బాబూ మాకూ బట్ట,
బాబూ మాకూ గూడూ...
మాకూ సదువు,మాకూ జీతం.
బత్తెం ఇచ్చెయ్యండయ్యొ
నీ కాల్మొక్తా బాంచెన్ దొరా,
మేమూ ఇంగిలిపీసే మాత్తాడేత్తామయ్యా,
నీ కాల్మొక్తా బాంచన్ దొరా!
మాత్రు బాసను సంపేద్దామండయ్యొ
నీకాల్మొక్తా బాంచన్ దొరా..

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.dt04-03-2009,

3, మార్చి 2009, మంగళవారం

విరహ మనస్కిని

సీత వెదికిన రాముడు ...:సబ్జెక్టు అఫ్ కాంటెస్ట్

'విరహమనస్కిని '

......................
రాముని తలచుచు
సీతా స్వాధ్వి
విరహ తాపమున
వున్న వేళలో సీతా
సీతా సీతా యటంచు
రాముని గాత్రము
వినిపించేనామెకు
వీనుల విందుగా
కర్ణ పేయమున
తలపో పిలుపో

రావనమాయో
సంభ్రమమున

అశోకవనిలో
తట్టరపాటున
సేతవెదికె రాముని కొఱకు . written by : నూతక్కి రాఘవేంద్ర రావు Dt 27-08-2009

స్వాగత గీతిక

ఆమని ఆగమన స్వాగత
గీతిక పాడేందుకు స్వర
తంత్రులు సవరించుకొంటూ కోయిల
పూదేనియ జుర్రుకొనే
ఆత్రంలో తుమ్మెద
తుండం సరి చేసు కొంటూ
రెక్కలు అల్లార్చుతూ ...
ఝుంకార స్వర
ర్సాస్వాదానందానురక్తితో
లేలేత చిగురులలో తొంగి వంగి చూస్తూ
స్నిగ్ధత్వం సింగారించుకొంటూ పూబాలిక
వసంత గమన వేళ మదనకేలీ విలసిత
మధుర భావ సంజనిత మనస్కిని జవ్వని
అర్ధ నిమీలిత నేత్రాలతో అనుభూతుల నాస్వాదిస్తూ
ఆమనినాహ్వానిస్తూ . రచన : నూతక్కి రాఘవేంద్ర రా వు . Dt.

27, ఫిబ్రవరి 2009, శుక్రవారం

శామూ ఎ నేమ్ ఇన్ సాన్డియాగో


శామూ తో శాన్ డియాగో సీ వరల్డ్ లో ఓ అర గంట పాటు గడపిన అనుభూతుల వలయంలో నుంచి ఇంకా మేము బయట పడలేదు.అది అంత తేలికగా వీలయ్యే సామాన్య మైన విషయం కాదని చాలా లేటుగా తెలిసింది.. తెలిసిన వారికి అట్లాంటి అవకాసం వస్తే వదులు కోవద్దని మాత్రం ఖచ్చితంగా చెబుతాను . ఇట్లాంటి అవకాశాలు చాల అరుదుగా లభిస్తాయని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.ఈ లోకాన్నే మరచి కాసేపయినా ఆత్మానందాన్ని పొందే ఇటువంటి ఆవకాశం అత్య ద్భుతం .

చక్కటి శిక్షణ ,అణకువ ,శిక్షకులు చెప్పింది వినే నైజం ,ఆ భారీ కాయం తో చూడ చక్కని రూపంతో సంగీతానికి అనుగుణంగా ,ఆ నృత్యం, ఆ జల క్రీడలు ,అత్యద్భుత విన్యాసాలు, సన్నిహితంగా పలక రింపులు ....షామూ వంద టన్నుల బరువుతో నలుపు తెలుపు రంగులతో నున్నన్నటి శరీరంతో చూడ చక్కగా వుండే ఈ జల చరం షుమారు ఏడు నుంచి పది అడుగుల ఎత్తు వెడల్పులతో ముప్పై నుంచి నలభై అడుగుల పొడవుంటుంది. ప్రదర్శనలో శిక్షక నిర్వాహుకుల అద్వితీయ సామర్ధ్యం అమోఘమనే చెప్పాలి.ఆ ప్రేమ ఆప్యాయత ఆదరణ , అకుంఠిత దీక్ష ,దక్షత అబ్బురమనే చెప్పాలి.

శామూ సాని హిత్యములో గడిపిన ఆ అరగంట సమయం లో బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరపించి పోతావు .నీ మనసులో అసూయ ,ఆవేదన,ఆందోళన ,ఆక్రందన ,ఆవేశం ,కావేషం, రోషం, దుఃఖం ,ఈర్ష్య ,ఇవేవీ దరి చేరవు. ఆ సమయం లో మనసు కాస్త స్థిమిత పడుతుంది.

అది శాండియాగో పట్టణం .అమెరికాలో నైరుతి దిశ లో కాలి ఫోర్నియా రాష్ట్రం లో వున్న ఫసిఫిక్ మహా సముద్ర తీర నగరం శాండియాగో పట్టణం.ఎన్నో ప్రపంచ ఖ్యాతి గాంచిన పరిశ్రమలు, సాఫ్ట్ వేరు కంపెనీలు ,అణువిద్యుత్ వుత్పాదక , సంస్థలే కాక ,లెగో లాండ్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జంతు ప్రదర్శన శాల ,కొన్ని వేల ఎకరాలలో విస్తరించి వున్న జూ సఫారి,sea world, aa aa ikkade ఈ సి వరల్డ్ లోనే మనం ముచ్చటించుకొనే శామూ నివాస ముండేది. ఈ సుత్తి మాకెన్దుకయ్యా అసలు విషయానికి రమ్మని మీరు నన్ను తిట్టు కొంటూ ఎదురు చూస్తూ వున్న విషయం నాకు తెలుసు.

వస్తున్నా ,అక్కడికే వస్తున్నా.

శామూ అంటే ఎవరనుకున్నారు? సముద్ర జీవ రాజం .వేల్.ఆ జీవాలు ఆ సీ వరల్డ్ లో పది దాకా వున్నాయనుకుంటా,కొంచెం పెద్ద చిన్న సైజుల్లోన్నే గాని దేని పేరు షామూ నో ఎవరూ గుర్తించలేరు, నిర్వాహకులు, . .శిక్షకులు ఇచ్చిన శిక్షణ మహాద్భుతం .ఆ మూగ జీవాల అభిమానాన్ని ,ఆప్యాయతని పొంది వారి నిర్దేశ కత్వంలో చిలిపిగా ప్రేక్షకుల పై నీళ్లు చల్లడం,కవ్వించడం , సంగీతానికి అనుగుణంగా నీళ్ళల్లో నిలబడి ఆ భారీ కాయాన్ని బాలన్స్ చేసుకుంటూ నృత్యం చేయడం, శిక్షకురాలిని అమాంతం నీటి అట్టడుగునుంచి ముఫై అడుగులు పైకి లేచి మూతితో పైకి లేపి నిల్పెట్టడం,ఏడెనిమిది వే ల్స్ కలిపి సంగీతానికి అనుగుణంగా నర్తించడం ,ఇవన్ని ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి .ప్రేక్షకుల పై నీళ్లు చిమ్మే టప్పుడు మొదటి నాలుగు అయిదు వరుసలలో వున్నవాళ్లు తడిచి పోతారు. అందుకు సిద్ధమై చాలా మంది పిల్లలు పెద్దలు ఆయా దుస్తులేసుకొని పోటీపడి ముందు వరసల్లో కూర్చుంటారు.

ఎన్నో ప్రఖ్యాతి చెందిన నగరాలు, కొన్ని వందల మైళ్ళ దూరం ఆ తీరం వెంట వ్యాపించి,పేరుకే పేరులు వేరయినా,నగర నిర్వహణలు, వేటికి అవే అయినా, చూపరులకు ఒకే బృహత్తర నగరంగా భాసిస్తూ వుంటాయి.అన్ని వందల మైళ్ళూ ఒకే నగరంలో ప్రయానిస్తున్నామన్న భ్రమ కలుగుతుంది.

ప్రపంచ ప్రఖ్యాతి గాన్చి న హాలివుడ్ సినీ ప్రపంచం,మరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్నీ లాండ్ , అమెరకా, మరియు ప్రపంచ చిత్ర రంగాన్ని ముని వేళ్ళతో నిర్దేశిస్తూ నాట్య మాడించే యూనివర్సల్ స్టూడియో లు వున్న నగరం లాస్ ఏంజిల్స్. సాన్డియాగో నగరానికి వుత్తర దిశగా ఫసిఫిక్ మహా సముద్ర తీరం ఆనుకొని విరాజిల్లుతోంది. ఆ మహా సముద్ర తీరాన ఆ మహా నగరాల గుండా రోడ్డు మార్గం లో ప్రయాణించడం జీవితంలో అద్భుత అనుభవం, జీవితానికో అను భూతి.ఈ పర్యటనలో ఎన్నెన్నో వింతలు విశేషాలు వున్నా షామూ ఒక ప్రత్యెక విశేషం .మిగతా విశేషాలు వాటి వాటి ప్రత్యేకతలు, ఆయా వ్యాసాలలో త్వరలో.

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు . తేది :శుక్రవారం 27-02-2009


25, ఫిబ్రవరి 2009, బుధవారం

పందికొక్కులు



పందికొక్కులు


-------------



పంది కొక్కుల్లా ఎగబడి తింటున్నార్రా అని కోపం వచ్చినప్పుడు పిల్లల్ని అంటాం. పనాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వాళ్ల నంటాం ఒరే పంది కొక్కుల్లా ఎగబడి తిన్దేవిట్రా అని.ప్రజల మీద పడి పంది కొక్కుల్లా దోచుకు తింటున్నార్రా అని ప్రభుత్వ వుద్యోగాసుల్నీ అంటాం. అట్లాగే రాజకీయ నాయకుల్నయితే వదిలి పెట్టం కదా.దేశాన్ని దోచుకు తింటున్నారు పంది కొక్కుల్లా అని అంటామా లేదా. మాట జనజీవన విధానంలో వూత పదం అయ్యింది. అది మన రాజ కీయ నాయ కులకి సరిగ్గా సూటయ్యే పదం అంటాడు మా వెంకట్రావుడు.నాకేమి తెలియదనుకోండి.ఇంతకీ పందికొక్కులు తినేదంతా పాడు చేసేదేంత? ఎవరికయినా వివరాలు తెలిస్తే చెప్పండి బాబూ.ప్రభుత్వోద్యోగులతోనూ రాజకీయనాయకులతోను సమంగా తిన్నయ్యన్కోండివాటితో పోల్చడం తప్పేమీ కాదు. అట్లా కాకుండా తక్కువ తింటే మాత్రం వాటిని ఆడిపోసుకోడం చాల పాపం. మనకి పుట్ట గతులు వుండవ్.. వాటి శాపం మనకి తగిలితే కష్టం. అందుకే ఎవరైనా లెక్కలు సేకరించి పెట్టి పుణ్యం కట్టుకోండి బాబూ.మాటలు జాగ్రత్తగా వాడి మనం జాగ్రత్త పడదాం.


పాపం అవేం చేశాయని వాటిని ఆడి పోసుకుంటారు.పోయి పోయి అట్లాంటి వాళ్ళతో పోలిస్తే పాపం అవి మాత్రం ఎంత అవమానంగా ఫీలవుతయండీ. నీసం ఆలోచించ కుండా మాట్లాట్టం ఏం బాలేదు.సీజనున్నప్పుడు దాచుకోవడానికి ఎచేలోనో పడి లేక పొతే పురినో కొట్టి కాసిని ధాన్యం గింజలు, మెత్తకోసం కొన్ని గడ్డి పరకలు నోటకరుచుకు పోతాయి.అంతే గాని వేలకు వేల ఎకరాల భూమి బినామి కంపెనీల పేరుతొ స్వాహా చెయ్యవు కదా. ఏదో శ్రమదానంతో ఒక కలుగు తవ్వుకొని ముందు రొజుల్లొఅవసరమౌతుయ్యని కావలిసిన ధాన్యం ,పప్పులు వగైరా దాచి పెట్టుకున్తయ్యి. మహా అయితే అవి నోట కర్సుకేల్లెదేంతని ,రోజుకు నాలుగు సార్లు తిరిగితే తడవకి యాభయ్ గ్రాముల చొప్పున రెడొందల గ్రాములనుకోండి ,


చేనుకి పదికంటే ఎక్కువుందవండి అట్లా చూసుకున్నా రోజుకు రెండు కిలోలండి. పంట కాలం మొత్తం నెల రోజు లనుకోండి ,మహా అయితే అరవ్య్యే గదండీ కిలోలు.అంత అమాయక ప్రాణుల్ని పట్టుకొని దోచుకున్టున్నాయనడం ఏం బాగండి,అన్యాయం కదా? దేనికయినా న్యాయం వుండాలండి.అంత కష్టపడి దాచుకొంటే పంట భద్రం గా వుంటుందన్న నమ్మకం వుండదండి. వర్షాలోచ్చినప్పుడు కలుగుల్లోకి నీళ్లు చేరి దాచుకున్న ధాన్యమంతా పాడాయి పోతుందండీ. వాటికి స్విస్ బంకులు లేవు గదండీ .దోచుకున్నది దాచుకోడానికి.వాటికుండే ఇబ్బందులు వాటికుంటాయి కదండీ.మనం పండించిన పంట దాచుకోవదానికే గోదాముల్ని అవసరం మేరకు కాదు అవసరం గుమ్మడి కాయంత అందుబాటు ఆవ గింజంత .ప్రభుత్వం ప్రణాలికలు పెట్టి ఆసొమ్ములు కాంట్రాక్టరు ద్వారా రాజకీయ నాయకులు భోన్చేయడానికి తరలించాక తప్పదు కదండీ.వాళ్లు ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టుకోచ్చారాయే.ఏదయినా పందికోక్కులతో పోల్చాడ అన్యాయం కాదండీ.ఎప్పుడైనా చూసారండి దాచుకున్న ధాన్యం ఖర్చు పెట్టి పంది కొక్కులు ఎన్నికల్లో నిలబడటం ,?అంతేలేండ్ సారూ నోరు లేనోల్లని ఎన్నయినా అంటారు.న్యాయానికి న్యాయం లేదు కదండీ.


రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.తేది:౨౭-౦౨-2009

23, ఫిబ్రవరి 2009, సోమవారం

ఎ అర్ రేహ మాన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ఎట్ వరల్డ్


ప్రపంచ సినీ చిత్ర రంగంలో , తన దంటూ ఒక ప్రత్యెక ఒరవడి ఉన్నా, ప్రపంచ చలన చిత్ర రంగ చిత్ర పటం పై ఇప్పటి వరకు సంచలనాలు సృష్టించ లేక పోయిన భారత దేశం ,స్లం డాగ్ మిలియనీర్ ద్వారా ఎనిమిది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు ,పొందడం , అందులో భారత గాన గంధర్వుడు ఎ అర్ రహమాన్ ఆస్కార్ అవార్డు పొందడం భారతీయులందరూ సగర్వంగా గర్వించదగ్గ విషయం. కుగ్రామంగా మారిన ఈ భూ ప్రపంచంలో సమస్యలు ఏ ఒక్కరివో కాదు, మనమదరివి అని ,ప్రాంతీయత ,భాష, మతం ,ఏదీ , మానవతా కోనాన్నుంచి మనిషిని వేరు చేయలేవన్నది ఈ చిత్ర విజయం ద్వారా ,చిత్రానికి దక్కిన అవార్డుల ద్వారా నిరూపిత మైంది.
వాస్తవికత కోసం ,భారతీయ వీధి బాలలకు తర్ఫీదునిచ్చి వారి నుండి సృజనాత్మకతను వెలికి తీసి నటింప చేసి,ఇతర స్థానిక నటులతో,ప్రాంతీయ సాంకేతికతతో,నిర్మింపబడి,ప్రాంతీయన్గాను, విదేశాలలోనూ , మీదు మిక్కిలి అమెరికాలోని భారతీయుల లోనూ వ్యతిరేకతకు,ఆక్షేపణ లకు ,వివాదాలకు లోనయి ,వివాదాస్పద మయినా స్లం డాగ్ మిలియనీర్ చిత్రం,అ త్యధికసంఖ్యలో అవార్డ్లు పొందడం ముదావహమైన విషయం.
కధ ఏదయినా,నటీ నటులేవరయినా ,దర్శక నిర్మాతలు ఎక్కడి వారైనా ,అంకిత భావం,కధన విధానం ,దర్శకుని సృజనాత్మక ప్రతిభ ,ఒక చిత్ర విజయానికి యెంత ముఖ్యమో ఈ చిత్రం నిరూపించింది.
సినిమా ఆసాంతం ప్రేక్షకున్ని కదలకుండా కూర్చోబెట్టే లా చేసిన ఈ చిత్ర దర్శకుడు ,ఈ విశ్వ కుటుంబపు సభ్యుడే , ఆతడు ఆతని చిత్ర పరివారము ,అభినంద నీయులు , ప్రశంసా పాత్రులు. రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది ౨౩.౦౨-2009

18, ఫిబ్రవరి 2009, బుధవారం

సంక్రాంతి హరిదాసు (సాతాని జియ్యరు )....కృష్ణార్పణం ....


మకర సంక్రాంతి ,తెలుగు లోగిళ్ళ లో అంబరాన్నంటే సంబరాల పెద్ద పండుగ . హరిదాసులు వూరూరా తిరుగుతూ చేసే గాత్ర కచేరి , గంగిరెద్దుల వాళ్ల సన్నాయి రాగాలు , గంగిరెద్దుల పద నాట్యం ,పాదాభివందనం , ,గాలిపటాల ఆకాశ నృత్యాలు , కొత్త చీరెల రెప రెపలు,కొత్త బట్టలు,కొత్త అల్లుళ్ళ సందడి ,అలక పాన్పులు,తీర్చడాలు, బావ మరుదుల ఎక సేక్కాలు , మరదళ్ల పరాచికాలు, ,.....
జల్లల నిండ కూరగాయలు ,గంపల నిండా పిండి వంటలు ,పిల్లలు పోటీ పడుతూ ముంగిట్లో కూర్చొని ,పది మందికి పంచడం ,అరిసెలు, బూరెలు ,గారెలు, పూర్ణాలు,పరవాన్నాలు ,చ క్కిలాలు ,కారప్పూసలు,చేగోడీలు , వాటి ఘుమ ఘుమలు చెరకు తోటల లో బెల్లపు వంటలు, రామ ములగ (tamoto ),వంగ, బీర, తోటలు,పెరళ్ళ నిండా బంతి పూలు,చేమంతి పూలు, సంపెంగలు, దొడ్లో పందిళ్ళ నిండుగా కాసిన ,సొర , చిక్కుడు, పొట్ల పందిళ్ళు,జామ చెట్ల నిండుగా జామ పళ్ళు, దానిమ్మ పళ్ళు ,రామ చిలుకలు కొట్టివేసి క్రింద పడ వేస్తె వాటి కొరకు కొట్లాడుకొనే పిల్లలు, అహో ...ఆ ..అను అనుభూతుల ఆ అనుభవాలు ఎంతెంతని ,ఎంతని చెప్పను,ఎవరికి దక్కును ఆ అనంతానందామృత ఝరులు తెలుగు వానికి దక్క .
హరిదాసు హరినామ గానం తో వుషోదయాన ఆ మేలుకొలుపు .ఇంటి ముంగిట..... కాదు ...కాదు , ప్రక్క ఊరి పొలిమేరల ,....ఆ శబ్ద తరంగాలు ఆ సుదీర తీరాల శబ్దిస్తూ మనలను మేలు కొలుపు తాయి.

ఆ మహాద్భుత హరి నామ స్మరణ,త్యాగయ్యవిరచించిన శ్రీహరి గీతామృత ఆనంద గాన స్రవంతిలో సాగి పోతూ ,, హరి దాసు.... .ఆతని పాట, తంబురా నాదం,గానం ,తన్మయ నృత్యం ......,ఆ మఖర సంక్రమణ వేళ ,సంక్రాంతి నెల పట్టిన వేళ ,లేగ దూడలు చెంగు చెంగున గెంతే వేళ, కోడె దూడల మెడలో గంటలు మ్రోగే వేళ ,రంకెలు వేస్తూ కదలాడే వేళ ,ఇతర పశువుల అంబా రవాలు వినిపించే వేళ,పక్షుల కిలకిలా రవాలు , కావు కావున కాకుల గుంపులు అరిచే వేళ,పొద్దు చుక్క పొడిచిన వేళ ,చలి గణ గణ వణికించే వేళ , కుక్కోరో మని తోలి కోడి కూసే వేళ , రోడ్లు, దొడ్లు వూడ్చే వేళ ,కళ్ళాపి జల్లుల శబ్దాలు వినిపించే వేళ ,ఆ వేకువ తో లేచి ఆవు పేడతో కన్నియలు గొబ్బెమ్మలు చేసి, వాటిని పసుపు కుంకుమ పూలతో అలంకరించే వేళ , ఇళ్ళ ముంగిళ్ళలో రంగవల్లులు అద్దె వేళ ,అలంకరింప బడిన ఆ గొబ్బెమ్మలను రంగవల్లికలలో వుంచే వేళ ......ఆ వుషోదయ నేపద్యంలో మంద్రంగా ,సుదూరంగా వినిపించే అద్భుత నాదం ,అమృత గానం , ఆ చివరి పదం కృష్ణార్పణం .... అతనే హరిదాసు.
హరిదాసు, అందంగా కట్టుకున్నబంగారు జరీ తో కూడిన ఎర్రని పచ్చని పట్టు పంచె పై పసుపు పచ్చని పట్టు వస్త్రాన్ని నడుము చుట్టూ తిప్పి కట్టి,ఆకు పచ్చని పట్టు తల పాగా తలకు చుట్టి , మెడలోబంతి పూల హారంతో , పట్టు వుత్తరీయముతో ,నుదుట హరి నామంతో, భుజాలపైన, వక్షము పైన ,తిరు నామాలతో, భుజాన తుంబుర తో ఒక చేత్తో చిడతలు ,మరో చేత్తో తుంబుర మీటుతూ, శిరస్సు పై , పసుపు కుంకుమలతో,తిరు నామంతోనూ ,పూలతోనూ ,మామిడి ఆకుల తోనూ ,అలంకరించ బడిన ,ప్రత్యెక రీతిలో తయారు చేసిన ,తళ తళ లాడే రాగి పాత్ర శిరస్సు పై నున్న సిరాస్చ్చాదనపై ధరించి,ఆ మాసంలో రోజులు గడిచే కొద్ది ఒక దాని పైన మరొకటిగా పాత్రలు, అలం కర ణలు పెరిగి పోతూ వస్తాయి. ,ఆ పాత్రలు వె డల్పుగా ఎత్తు తక్కువగా వుండి,ఒక దాని కంటే మరొకటి చిన్న దయిన పాత్ర లు, ఒక దాని పై మరొకటి పెంచుతూ ,.నెల చివరికి వచ్చే సరికి నాలుగు అడుగుల ఎత్తున ,పాత్ర పాత్రకి బంతి పూలతో,పుష్పాలంకరణ ,పసుపు,కుంకుమ, తిరు నామాలు మామిడి ఆకులు , వీటన్నింటితో అలంక రించి ,వాటన్నింటిని , తల పయిన స్థిరంగా నిల బెడుతూ ,పడకుండా నియంత్రిస్తూ, సాధన చేస్తూ (ఆ పాత్రలు పెంచే లెక్కల ప్రాతిపదిక ఈ వ్యాస రచయితకు తెలియదు. పాత్రలు పెరుగుతున్నప్పుడు బిక్ష అందుకునేందుకు, తాళం వేసేందుకు ఒక సహాయకుడు వెంట వుంటాడు..) ఒకదానిపై ఒకటి పాత్రలు పెంచుతూ నడచి వస్తుంటే , గాలి గోపురంతో సహా ఆ పాండు రంగడు నడచి వస్తున్నాడా అని తలపించే మహత్తర ఆహార్య ముతో, ......
చేతి చిడతల శబ్దాలతో , చిందులేస్తూ ప్రదక్షణ రీతిలో తిరిగే సమయయంలో వింత వింత గా ధ్వనించే కాళ్ళ గజ్జల రవళి వినిపించే వేళ ,తంబుర నాద తరంగిణిలో మమై క మై ,ఒక పాదం పై బరువు వుంచి మోకాలు నేలకు మోపి వినయంగా కూర్చొని తల వంచి తలపయినున్న పాత్రలో గృహ యజ మానురాలు బిక్ష వేసేటప్పుడు హరి దాసు పలికే పదం 'కృష్ణార్పణం' .

తెలుగింట ప్రతి యింట, సంక్రాంతి మాసాన
హరి దాసు లేనిదే సంక్రాంతి యే లేదు,
గంగిరేద్దె రాని ముంగిలే లేదు
కళ్ళాపి చల్లని లోగిలే కనరాదు
రంగ వల్లిక లేని కళ్ళాపి లేదు,
గొబ్బెమ్మ పెట్టని రంగవల్లిక లేదు ,
గొబ్బెమ్మలే లేని రహదారి లేదు .
యింటి యింటిని కలిపి,
వాడ వాడను కలిపి ,
వూరు వూరును కలుపు ,
అందాల అతివల
హస్తాల వైచిత్రి
అందాల ఆ ముగ్గే
సంక్రాంతి ముగ్గు

నా చిన్న తనాన ప్రతి ఏడూ, విన్న ఆ తంబురా నాదం ఆ త్యాగయ్య పద విరుపులు ,ఆ పలుకు లు .. ..,నెల పట్టిన దగ్గర నుండి ఆ మాసపు ప్రతి రోజూ,దూరంగా ప్రక్క వూళ్ళో పాడుతుంటే ,ఆ పాటలు అలా అలా గాలి అలల పై తేలియాడుతూ అలరించే వేళ, తల విదిల్చిపిల్లలందరం నిద్ర లేచి, కాల క్రుత్యాదులు చేసుకుని , ఆ చలిలో వణుక్కొంటూ, పుల్లలతో చలి మంట చేసుకొని ,ఆ మంటల వేడి లో చలి కాచు కొంటూ .......
హరిదాసు (సాతాని జియ్యరు) కు బిక్ష వేసేందుకు ,నేనంటే నీనని పిల్లలంద రం , కొట్లాడు కొనే వేళ ,
ఆ హరిదాసు (సాతాని జియ్యరు)వస్తే, నేనంటే నేనే ముందని మేమనుకుంటుంటే బాబూ నీవు సగం వేయమ్మా ,పాపా మిగతా నీవు ....కృష్ణార్పణం ......అనే ఆ హరి దాసు....ఆతని పేరేమిటో, వూరేమిటో ఏమీ తెలియదు గాని, ఆ అనుబంధం అంతరించి అర్ధ శతాబ్ది దాటినా
ఇప్పటికి ...ఆ పదం ..కృష్ణార్పణం... శ్రవణా నంద కరం
ఆ ఆహార్యం
ఆ గానం, గాత్రం ,నృత్యం ,
వాద్యం,పలుకు, నడక,
నడత అంతా ,ఆ జ్ఞాపకాల
అలజడులు కంపనలు
నా మస్తిష్కపు ,లోలోతుల ,
నా తనువున కణ కణా న,
నా మది లోపలి పొర పొరలో
పదిలంగా భద్రంగా...
..కృష్ణార్పణం...
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు .తేది:౧౮-౦౨-2009

ఆశ -ఆనందం


ఆశ -ఆనందం

నడుమ

అనంతానంత అగాధం

ఆనందపు అనుభూతిని

అందుకొనుట ఎంత కష్టం

అంతటా కంటకాలు

కందకాలు, అడ్డంకులు

నిరాశ, నిస్పృహ

దుఖం , బాధ, క్రోధం

అత్యాశ- అహంకార

మదపూరిత, మాస్తార్యం

ఆ అడ్డంకులు ,

ముళ్ళపొదలు

అన్ని... అన్నింటిని

అగాధాన నెట్టి వైచి

త్రిప్తి అనే వంతెన తో !

ఆవలి తీరం చేరుకో !

అనుభవించు అనుభవించు

ఆనందపు లోకమదే !!!

అంతా నీకొరకే. రచన: నూతక్కి రాఘవేంద్ర రావు తేది :౧౮-౦౨-2009

కిటుకు -మర్మం


నీటి లోతు తెలుసుకొని

ఈత కొరకు దిగు గాని

అన్తెరుగని కొలనులోన

తలమునకలు కాబోకు.

వ్యాపారం వ్యవ హారం

అంతా అనుభవ సారం

ఆను పాను తెలియకుండ

అందులోన అడుగెయ్యకు రచన: నూతక్కి రాఘవేంద్ర రావు , కూర్పు-మార్పు తేది:౧౮-౦౨-2009

తృప్తి


అందుబాటులో వున్న
పూవు కోసుకో గాని
చిట్ట చివరి కొమ్మ నున్న
పండు కొరకు పాక బోకు.
దొరికిన దానితోనే
సంతృప్తి ని పొందు కాని
దొరక నట్టి దానికొరకు
వేసటపడి భంగ పడకు. రచన: నూతక్కి రాఘవేంద్ర రావు ,మార్పు తేది:౧౮=౦౨-2009

కర్మ కాటు


అపుడెపుడో ఏదేదో
చేయ లేదె అనుకుంటూ
నిట్టూర్చుతూ కూర్చుంటే ...
ఇపుడైనా చేయకుంటే !!!

జరిగిన కాలమింక నీ
దరికి మరలి రాదు కదా !
జీవన కాలమేమి
కొంచమైన పెరగదు కదా !

తెలుసుకొంటే
వెసులు బాటు
తెలియకుంటే
కర్మ కాటు
రచన:నూతక్కి రాఘవేంద్ర రా వు , మార్పు తేది :౧౮-౦౨-2009

ఐకమత్యం


ధనం తోటి కొన్న బలం
వుంటున్దొక క్షణ కాలం
మనం ఒకటి అన్న బలం
నిలిచి వుండు కలకాలం

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు. మార్పు తేది :౧౮-౦౨-2009

14, ఫిబ్రవరి 2009, శనివారం

సత్తిగాడి కబుర్లు --నాలుగో పేజి

అయ్యా నిన్న ఏదో పనుండి వెళ్ళాల్సి వచ్చిందండి.నిన్న ఆ సత్తిగాడి ప్రశ్నలు గుర్తొచ్చి అసలు నేను బయటకు ఎందుకొచ్చానన్నవిషయం మరచి పోయా నంటే నమ్మండి .ఇవ్వాళయినా వాడి గురించి ఎక్కువ ఆలోచించకుంటే మంచిదండి.

నిన్న ఇక్కడ నుంచి ఎలతా వుంటే మళ్లీ వాడు కలిసాడండి. కలిస్తే వూరు కోడు కదా ,వాడు మాట్లాడటం అడగటం మొదలేడ్తే నేనేకాదు ఎవ్వరైనా ఆగాల్సిందే. వాడు నా ఎదురుగా నిల బడి నన్నాపి నమస్కారాలు పెట్టి వాడన్తాడూ...
అయ్యా నిన్న తొందరగుంటే బేగి ఇంటి కెళ్ళి పోయిన గదున్దన్దయ్య,అయ్యా నాకు తెలియ క అడుగుతానందయ్యా ,ఆడోల్లకి ,మగోల్లకి , మనమే ఎందుకండందయ్యా సాన ఎత్తాసం సేత్తాం .మనకి పుట్టినోల్లలోనే ఆడ బొట్టిల్ని ఒక రకంగా ,మగ పిల్లగాళ్ళని ఒక రకంగా సూత్తాం గదన్దయ్య,ఎందుకంతెనండయ్య ,ఎనకటి కాలాలో నయితే ఆడాళ్ళని సదివించే తోళ్ళు కాదు,ఆడది సదివి వూల్లేలాల్న అనేవోళ్ళు , ఆమ్మలు అమ్మమ్మలు కూడా అట్లనే సంగేతం పాడేవోల్లు. ఆడాళ్ళు ఎదక్కుండా ఆడాళ్ళేఅడ్డంకీ కదండయ్య,ఆల్లు నిజంగా నిజెం సేప్పారయ్య. కాని ఇప్పుడట్టా కాదు గడన్డయ్య ఆడ బొట్టిల్ని సదివిస్తాన్నం ,ఆల్లు సాన గొప్పగ సదూకుంతన్నారు ,వుద్దేగాలు సెత్తన్నరు, ఇంక ఆబిడ్డకి పెళ్లి సేయ్యలంటే ఈజీ
అయిపోదంకున్తున్నారు గాన్దయ్యా ,అంట తేలిక కాదందయ్యా .బొట్టి కంటే కుంచేమన్న ఎక్కువ సదివుండాలిగడకాదేన్తందయ్యా ,ఈ రోజుల్లో బొట్టిలు సాన ఎత్తు పెరిగి పోతుంటి రయ్యే ,పిల్ల గాడు జరన్న ఎత్తున్దాలే కాదన్డైయ్య , ఆడ బొట్టిలు నాజూకుగా అందంగా ఎదుగుతున్నారు గదందయ్యా, చూస్తా చూస్తా గలీజోన్ని తేలేం కదందయ్యా,ఇంక,
kutumbaala సంగతి కొచ్చా మానుకోండి ,అదంతా మంచి గానే వుంటది గానందయ్యా,అసలు ఆని గుణం గురించి, ఆరోగ్యం గురించి, అలవాట్ల గురించి ,అందరితాన మంచి రిపోర్టే ఒస్తాదయ్య,దోస్తులు గని,ఎవ్వరూ సేడ్డగా సెప్ప రయ్య.గుణం దేవునికే ఎరకయ్య. నాయకి అమ్మకి ఆని బుద్దులెం తెలుస్తయందయ్యా ఈ rojullo jaatakaala pichhi mudirindi gaanandayya, adi moga pillagaadu ,pilla nachanedan seppakunda jaatakam kalavatledani manchiga tappinchonenduku pankostannayyayya.జాతకాలు కాదయ్యా సూదాల్సింది ,పెళ్లి సేద్దామనుకున్నప్పుడు ,ఆడఅ పిల్లకి ,మగ పిల్లగానికి ,పరీచ్చలు ,adenadayya , డాక్టరు పరిచ్చలు సేయించి తే నందయ్య , ఇద్దరికీ అన్ని మంచిగుంటే పెళ్లి సేయ్యోచ్చు,లేకుంటే మానేయోచ్చు గదందయ్యా.ఈ రోజుల్లో ఎవర్ని నమ్ముతామందయ్యా,పెళ్లి అయిన తరవాత ,
ఎయిడ్స్ వొందనితెలిసిన్దనుకొందయ్యా , లేదా కిడ్ని పాదయ్యిందని తెలిసిదనుకొందయ్యా,సుగారుందని తెలిసిన్దనుకొందయ్యా,సాన కష్టం కదండయ్య, మండులున్న జబ్బులయితే రోగం నయం చేసు కోవచ్చు గాని సూత్తా సూతా ఎందుకు దిగాల్నడయ్య,అందుకే పెళ్ళికి ముందే మొకమాతం లేకుండా అన్ని పరిచ్చలు సేయించాలే అని నా వుద్దేసమందయ్యా.నాకు తెలిసో తెలియకో వాగానందయ్యా ,నన్ను చమించందయ్యా . బేగి పోవాల్నందయ్యా, రేపు ఈడనే కలుస్తానందయ్యా . వాడితో ఇంకేం మాట్లాడుతామంది తలూపటం తప్పితే.
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.తేది:౪-౦౨-2009

12, ఫిబ్రవరి 2009, గురువారం

సత్తి గాడి కబుర్లు ---- మూడో పేజి

అంతరాలంటే ..ఎట్లాగంటే నండయ్యా ,మన పల్లె టూరోల్లం వున్నామనుకొందయ్యా ,ఆడ అయదర బాదులో వుండేతోల్లకి ....ఆల్లకి మనకి అంతరం వుంటది గదందయ్యా .అట్టాగే వున్నోడికి నీకు అంతరం లేదేన్దిరా అనే గదన్దయ్య నన్నప్పుడు మీరు తిట్టేది .అట్టాగే ఇండియాలోవాల్లకి,అమేరికాలో వున్దేతోల్లకి అంతరమే గదన్దయ్యా అంతారు.అంతరమంటే తేడ అన్నా మాటన్డయ్యా .అమ్మయ్య ,సాన బాగా సెప్పా గడన్డయ్యా .సెబాసండి.అమ్మో మిమ్మల్ని సెబాస్ అనేటన్తోన్ని కాదన్డయ్య , నాను నానే అనుకున్నానందయ్యా .
ఇక్కడేమో ఎడ్లబండి మీద ,సైకిల్ మీద ,బస్సులో రైళ్ల మీద పొతే ,అయ్దరా బాదులో , స్కూటర్ పైన ,టాక్సీ లో ,ఇమానాల్లో పోతారన్దయ్యా .అక్కడ ఎడ్లబండి మీద పోవాల్నంటే సాన కరుసవు తుందంట గదన్దయ్య .అంటే ఈడ తక్కువయ్యేది ఆడ ఎక్కువ పెట్టాల్ననమాట .ఇది అంతరమే కదన్దయ్యా.అంటే అయిదరా బాద లో యడ్ల బండి డబ్బులున్నోల్లకే గదందయ్యా .యీడ యడ్ల బండి ఎక్కేది పెదోల్లె .ఇదంటే అంతరమే గడందయ్యా . అంటే పల్లెటూళ్ళో పేదోడు పట్నంలో పెద్దోడు ఒకటే గదన్దయ్య .అదే గదన్దయ్యా పల్లెటూరికి పట్టణానికి అంతరం.
యింకా సాన మాట్టాడాలి గానండయ్యా ..అబ్బెంతరముంటే సిప్పీసేండయ్య. అట్టా మూతి మూతి ముడుసుకుంటే బాగుండదందయ్యా .మల్ల మరో సారి మాట్టా డు కొందా మండయ్యా. రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది: ౧౧-౦౨-౨౦౦౯.

సత్తి గాడి కబుర్లు ----రెండో పేజి

నమస్కారమండి కొంచం లేటయ్యింది, నిన్న ఎక్కడ వున్నామంది ?సత్తిగాడి దగ్గర...ఛ...ఛ వాడి ఊసే ఎత్తద్దనుకొంటే పొద్దు పొద్దున్నే వాడి వూసే . సరే మొదలెట్టాం కదా ... ఒక రోజు వాడు అంటాడూ అయ్యా నేనిన్నానుగందా దేశమంటే
మడుసులే దేశమంటే మట్టె కాదూ గట్లాని ....ఏందీ సారూ దాని మతలబో !!అయ్యా ఈ గొప్పోల్లు సాన గొప్పగా సేబుతారే గాని ఈ మట్టి బుర్ర కెక్కదయ్య,అయ్యా ఈయనేమో మట్టి మడుసులంటాడు గందా ,ఇంకో గోప్పాయనండి ఏమంటాడంటే
ఆ..మట్టి .. తిండి..తిండి ...మట్టి ..తిండి . తిన్డుంటే కన్డున్దోయ్ కండ కలోడే మన్సోయ్ అన్నాడన్టండి .అన్నాడంట కదండీ ,
దాని మతలబు సేప్పండయ్యాకండలేనోడు మదిసే కాదండయ్యా ? మాకు తిన్తానికైతే తిండి లేదు గందా ,కన్డేట్టా వస్తాదయ్యా ? నా ఒంటిన కండె లేదంటే నె మడిసినే కాదేన్తండయ్యా, అయ్యా మరి మీరేమో అప్పుడప్పుడు నన్ను తిడతారు గదందయ్యా ,ఎం మనిషివిరా అని ,అంటే మీరోప్పు కున్నారు గాదందయ్యా కుంచెం సేపైనా .అంటే నె సేప్పోచ్చే దేన్తన్తెనందయ్యా నేను మడిసినే గాని కండ లేదు .కన్దేట్టుంతదయ్య తిండే లేకుంటే ?అన్నాయమయ్య ,తినాలంటే డబ్బు కావాలె ,డబ్బుకావాల్నాటే సంపాదించాలే ,అయ్యా సంపాదనంటే గురుతుకొచ్చింది పోయినేటి దాక మా లెక్కనే వుండే గందా ఆడు ఆ ...ఆ డి పెరెందబ్బా .. గ్యాపకాని అందాలే ,పెరెదయితే ఎందిలే గాని ఆడు కోట్లు సంపా యించి నాదంతన్డయ్య .ఆడికి మేమంతా ఓట్లేసి గెలిపించిన్చినావు గదందయ్యా,ఆడు కల్లు పోసి, సారాపోసి మా వాడ వాడనే తిప్పుకున్నాడుకదందయ్యా, ఆయనెంతపెద్ద మంత్రంట,ఆయనే దీని కంతా కరుసు పెట్టాదంతందయ్యా , ఆయనోచ్చి ఎంతెంతో సేప్పాడందయ్యా ...... ఇప్పుడేమో మా సంగతే పట్టిచ్చుకోదేన్దయ్యా యీడు . పాపం ఆడు మాత్ర ఎం చేస్తాడు లేయ్యా ,అయ్యా యీడు గెల్సినంక సపాయిందాట్లో ఆ బాబుకి శానా పంపాల్నంతయ్య , పాపం సాన కస్తాపదతన్నాదందయ్యా.ఆ మంత్రయ్యకి . .కర్సు పెట్టినాడుగాదందయ్యా అయ్యా ఆ మంత్రాయనకూడా పెద్ద మంతిరి కి ఇయ్యాల్న్తన్తన్దయ్యా అయ్యా మాటల్లో పడి నేనేల్లోచిన పని మర్సిన.....ఎల్లోస్తానందయ్యా. .
ఇట్లా వుంటుందండీ సత్తిగాడి కబుర్లు.మనకెందుకు లెండి మనం వాడి కబురులలో పడోద్దండి .మళ్ళి రేపు కలుద్దా మండి .. ఏమి అనుకోవద్దు నాకూ పనుందండి. రచన :నూతక్కి రాఘవేంద్ర రా వు తేది :౧౨-౦౨-౨౦౦౯

11, ఫిబ్రవరి 2009, బుధవారం

సత్తిగాడి కబుర్లు ...ఒకటో పేజి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ,పొగడరా నీ జాతి నిండు గౌరవము. చిన్నప్పటి నుంచి పోగుడుతున్నాం.పోగుడుతాం,ఇక ముందు కూడా పొగుడుతూనే వుంటాం. అది ఒక పౌరుడిగా మన కర్తవ్యమ్ .విదేశాల్లో మన దేశం గురించి , మన లోటు బాట్లు తప్పులు లోపాలు గురించి మాట్లాడకుండా అంతా మంచే మాట్లాడుకుందాం.చాలా గొప్పగానే చెప్పుకుందాం. బాగుంది. ప్రచార సాధనాల ద్వారా కూడా అట్లాగే ప్రచారం చేయమని వత్తిడి తెద్దాం. అది ఇంకా బాగున్నది. అది అంతా అనుకున్నట్లే జరిగి విదేశాలన్నీ మనల్ని గొప్పగా అనుకుంటున్నాయి సరే . అదీ బాగుంది.
మరి మనదేశం లోపల మన సంగతే మిటీ? మన దేశం అంటే వుట్టి దేశమేనా ?ఆ పెద్దాయన ఏదో... అన్నాడే ..ఆఎమన్నా..ఆ .. ఆ ...డబ్బా ....ఆ ....దేశమంటే మనుషులోయ్ !అన్నాడు. అంటే మనుషులంటే దేశమనే కదా అర్థం. ఆయనన్నాడు కాబట్టి ఒప్పు కుందాం.అంటే ఆయన చెప్పినట్టు చచ్చినట్టు మనం ఒప్పుకున్టున్నామనమాట.'యామైనా గొప్పోల్లు సాన గొప్పగనె సేబుతారండి' అంటాడు మా సత్తి గాడు.వాడు తక్కువగా అనుకుంటున్నారేమో .చాలా తప్పులో కాలేసినట్లే మీరు .మాస్టారూ ! ఆ సత్తిగాడి కబుర్లు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది .వాడి గురించి తరవాత మాట్లాడుకుంటే పోలా ,అయినా యెంత తక్కువగా మాట్లాడు కొంటె అంత మంచిది . మనం రేపు మాట్లాడు కుందాం .శలవిప్పించండి.
తేది:బుధవారం,పదకొండో తేది, ౨౦౦౯.రచన :నూతక్కి రాఘవేంద్ర రావు .

చిక్ బీక్ డోం / Chick beak dome ( half dome )- యూసమైట్ పార్క్)



యూసమిట్ వ్యాలీ :

పురాతన శిలలు ,శిఖరాలు
శిలాజాలు ,వున్నత పర్వతాలు
నిమ్నోన్నతాలు , జలపాతాలు
సెలయేళ్ళు,నదీనదాలు
పక్షి వృక్ష, జంతు ,సమూహాలు
ఓషధులు ,మహోన్నత వృక్షాలు
పరిపుష్టిత అరణ్య సమ్మిళిత ప్రపంచం
ఆ అద్భుత పర్వత లోకం .....

అక్కడకు వినోదం కొరకే గాక ,విజ్ఞానం కొరకు ,విద్యా ప్రాప్తికి, పరిశోధనకు, ప్రతి నిత్యం ,అనేక వేల మంది పర్యటిస్తూ వుంటారు. ప్రభుత్వం ఈ పర్యాటక కేంద్రాభివ్రుదికై వెచ్చించిన మొత్తాన్ని పర్యాటక్యాభి వృద్ధి ద్వారా తిరిగి రాబట్టుకో గలుగు తోంది. ఈ విధానం ఏ దేశానికైనా అనుసరణీయం.
వేల ఎకరాలలో అమెరికాలో వున్న యూసమిట్ ప్రాంతం ఆరక్షిత జాతీయ వనం . ఇక్కడకు చేరడానికి అనేక ప్రాంతాలనుండి సురక్షితమైన,సౌ కర్యవంతమైన రోడ్లు వున్నాయి. ప్రభుత్వ రవాణా సౌ కర్యాలున్నా ఎక్కువ మంది తమ వాహనాల్లో వస్తుంటారు. మధ్య మధ్య వసతి గృహాలలో విడిది చేస్తూ ఎంతెంతో దూరాల నుంచి కూడా రోడ్ ద్వారా ప్రయాణం చేసి వస్తుంటారు. శ్రమ ధన ప్రయాసలతో కూడుకొన్న దే కాని ఈ యాత్ర అద్భుత ఆనందానుభూతుల్ని మిగుల్చుతుందనడంలో సందేహంలేదు.ఈ ఆనందాన్నిజ్ఞాపకాలను నా జీవితాంతం మిగుల్చు కొంటాను.
వన్య భరిత పర్వతాలతో, శిఖరాలతో ,ఎలుగుబంట్లతో సింహాలు పులులు ,జింకలు ఇత్యాది ఎన్నో ఇతర జంతు జాలంతో,వాటి అరపులతో రకరకాల పక్షులతో ,కిలకిలారావాలతో ,జలపాతాలతో , సాంద్ర తరమై సు విశాలమైన కైవారాలతో ఆకాశాన్నంటే సాంద్ర తర వ్రుక్షారన్యాలతో ,ఔషధ జాతుల మొక్కలతో, సెలయేళ్ళ పరవళ్ళతో , సుందర వర్ణ భరిత వుద్యానవనాలతో ,నదులతో ఆ లోయ ప్రతి నిత్యం సజీవంగా కళ కళ లాడుతూ అలరారుతుంటుంది.

ఇక్కడి స్థానిక ప్రజల, ఆటవిక జాతుల పునరావాసానికి, అభ్యున్నతికి ,సంక్షేమానికి ,అమెరికా ప్రభుత్వం అమిత శ్రద్ధ తీసుకుంటోంది.ఇక్కడి ప్రభుత్వం సామాజిక అవసరాలకు సేకరించే భూమి కి చెందిన భూమి పుత్రులను వారి మానాన వారిని గాలికి వదలదు.ముందే పునరావాసానికి ప్రణాలికలు రచించి ఆచరణలో పెడుతుంది.దానికి కావలిసిన నిధులను సమకూరుస్తుంది. ఇదంతా ఆ యా కార్యక్రమ నిర్మాణం లో భాగంగా కొనసాగుతుంటుంది . ప్రతి దేశానికి ఈ ప్రక్రియ ఆదర్సనీయం.

పర్వతాలను ,శిలలను ,అడవుల్ని, ఓషధ జాతి మొక్కలిని ,లోయలను, సెలయేళ్ళను, జలపాతాలను ,,జలాశయాలను ,రహదారులను,అక్కడి జంతు వృక్ష సముదాయాన్ని కాపాడేందుకు ,వివిధ భాగాల్లో పరిశోధనలు జరిపేందుకు వేరు వేరు ప్రభుత్వ విభాగాలున్నాయి. వేల మంది విశ్వ విద్యాలయ విద్యార్థులు యిక్కడ వివిధ రంగాల్లో పరిశోధనలు చేస్తుంటారు. పర్వతారోహణ ఇక్కడ ప్రత్యెక క్రీడ.మంచులో ఆడే క్రీడలకు కూడా యిక్కడ ప్రత్యేకసరదా చూపుతారు.ఇక్కడ యాత్రలో అనేక వింతలు విశేషాలు చూడవచ్చు.పర్వతాలు, శిఖరాలు,శిలలు శిలాజాలు ,మహోన్నత వృక్ష జాతులు, లోయలు, జలపాతాలు, సెలయేళ్ళు ,పక్షులు, ఆరక్షిత జంతు జాలం ,ఒకటేమిటి అనేకం.అందులో
ప్రత్యెక మైంది హాఫ్ దోం అని పిలవ బడే శిఖరం.ఆ లోయ నుండి ఆ దృశ్యం చూడ టానికి అద్భుతంగా వుంటుంది .
నేను దానికి ప్రత్యేకమైన పేరు పెట్టుకున్నాను . అది చూడటానికి... ఒక పక్షి పిల్ల, తల్లి తెచ్చే ఆహారం కోసం గూటిలోనుంచి తల బయటకు పెట్టి ఎదురు చూస్తున్నాడా అన్నట్లు ..భావన నాకు కలిగింది. కాబట్టి దానిని చిక్ బీక్ దోం ( డ కారం లో ఒత్వం పలకడం లేదు. )అని పేరు పెట్టాం. చిక్ అంటే పక్షి
పిల్ల ,బీక్ అంటే ముక్కు .
కొన్ని కొన్ని కాలాల్లో (సాయంత్రం వేళ మాత్రమె) సూర్యుడు పశ్చిమ ముఖుడై తరలే తరుణాన ఆ లోయలో పర్వతాల నీడల కదలికల పరిణామ క్రమంలో ప్రస్ఫుటంగా ఒకే ఒక శిఖరం పై కాంతి మిగిలి వుండి ఆ దృశ్యం ,మహాద్భుత దృశ్య కావ్యంగా ఆవిష్కరింపబడుతుంది . .

సూక్ష్మ దృష్టితో, విమర్సనాత్మకంగా ,పరిశోధనా పరంగానూ ,వాస్తవ పరంగానూ చూస్తే నా ఈ వ్యాసంలో లెక్కకు మించి దోషాలు కనపడవచ్చు. కాని వాస్తవ దూరాలు మాత్రం కాదు.
న పర్యటనలో కలిగిన ఆనందానుభూతుల్ని నలుగురితో నా భాషలో నా వారితో పంచు కోవడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

ఇక్కడకు పర్యాటకులు రోజూ వేల సంఖ్యలో వస్తుంటారు .కొద్ది మందికి మాత్రమె అక్కడ బస చేసే అవకాశముంది మిగిలిన వారు ఆ రోజు సాయంత్రానికి తిరిగి వెల్ల వలసినదే..,మనం మన అవసరాలకు ఆహారం నీరు తీసుకు వెళ్ళినా, అవసరానికి భోజన ఫలాహారాది సదుపాయాలు,సోవ్చాలయాలు వున్నాయి.
నా అనుభూతులు:

ఆ దృశ్యం :
చిక్ బీక్ దోం (అని నె పిల్చుకొనే )
హాఫ్ దోం


ఆ లోయలో ఆనంద హేల
అందరు వేచి చూసిన
ఆమహాద్భుత సుందర దృశ్యం
ఆ విర్భవించిన ఆ క్షణం
ఆ వున్నత శిఖరంపై ఆవిష్కారం

కోటి సూర్య కిరణ కేంద్రీకృత భావన
ప్రభాయమాన వుషా కాంతి వుద్దీపన
నలుదెసలా పర్వత పంక్తుల నీలి నీడలు
భానుని పశ్చిమ పయనపు పరిణామ క్రమాన
లోయలలో సాంద్రతర చీకటి ఛాయలు
ఆ పరిణామపు పరిక్రమములో
వుధ్భవిన్చిన్దా అత్యద్భుత దృశ్యం

ఆ లోయ ,పర్వతాలు ......

సుందర పర్వత సానువులు
మహోన్నత శిఖరాగ్ర శ్రేణులు
అత్యంత పురాతన శిలా తోరణాలు
అత్యున్నతాలు.. అగాధాల లోతులు
ఆ తారతమ్య సమ్మేళనం
ఆ లోయల సౌందర్య రహస్యం
ఆకాశపు ఆ అంచు నుండి ఆత్రంగా
జాలు వారు పెను జలపాతపు
వుగ్ర రూప సౌందర్యాలు
నిరంతర జలపాతపు శబ్ద తరంగాలు
ఆ నీటి తుంపరలు మది మదిలో నింపే
మధుర భావనలు. చిలిపి చేష్టలు
సెలయేరుల గలగలలు
నదీ నదాల వురవళ్ళు పరవళ్ళు
క్రూర మృగ జంతు శిలా
వృక్ష ఔషధ పర్వత
పరి రక్షిత ఛత్ర ఛాయ
సుసంరక్షిత జాతీయ నందనం
పరి శోధనావేశ పరుల
నిత్య సత్య త్యాగ ఫలం
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు. తేది : ౧౧ - ౦౨ - ౨౦౦౯

10, ఫిబ్రవరి 2009, మంగళవారం

నేత్ర పర్వ సంగీతం - (గ్రాండ్ కానియన్స్)


నా గళం లోన వాక్కు లేదు
నా నేత్రాలకు దృష్టి లేదు
అంగాంగం కదలదేల
సమ్మె చేస్తున్నాయి కాబోలును
గుండె కవాటాలు
కదలనని మారాం చేస్తున్నాయి
సుషుప్త స్థితి లో
నా మనసు శరీరం
అసంకల్పితంగా
నోరు తెరచి
అనిమేషిత నేత్రుడనై
ప్రక్రుతి చిత్రించిన
వైచిత్రిని ద్రుశ్యిస్తూ

వు త్తుంగ తరంగిత
మనో జనిత
భావ ఘర్షణం ..
అసంకల్పిత
వ్యక్తీకరణలు
నాలో నేను ...
ఈ గాయం భూమాతకు
కలిగించిన వారికి
చేతులెలా వచ్చాయో !!!
భీకరాఘాతపు ఈ చారిక
భూమి కెటుల చేరిందో!!
కాదు కాదు కాదు కాదు
అది గాయపు చారిక కానే కాదు
మది తలపుల ద్వైధీ భావం ....

కాబోలునుపుడమి తల్లికది
ప్రక్రుతి చేయించి యిచ్చిన
అతి సుందర వజ్ర ఖచిత కంఠ మాల
అనంతానంత అఖాతాలు
యోజనాల దైర్ఘ్యం లో
సుదూరాలు ఇరు తీరాలు
సుందర పర్వత పంక్తులు
ప్రక్రుతి భూమాతకు చేసిన
అలంకారమా!!!!మహాద్భుతం
అనూహ్యం అనిర్వచనీయం
వీక్షకుల కది
గానామృత కావ్యాన్విత
నేత్ర పర్వ సంగీతం .
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:౧౦ -౦౨-2009

9, ఫిబ్రవరి 2009, సోమవారం

అహం


అండ పిండ బ్రహ్మాండ లో

అసంఖ్యాక నక్షత్ర కూటములు.

నిరంతర భ్రమణంలో

నిత్య పరి భ్రమణం

ఆ పరిభ్రమణ వేగంలో

ఒకటికొకటి ధీకొంటే

వుత్పాతం మహోత్పాతం

తదుత్పాత నివారణ కై

అయస్కాంత క్షేత్రావిష్కారం

ఆయా పరిధుల నియామకం

నియమిత పరిధుల్లో పయనం.

ఏ తార మరో తార పయనానికి అడ్డు రాదు

అది నియమం ఆ నియమ

నిభందనల సంకలనం

రూపొందిన విధి విధానం

ఆ విధి విధాన అతిక్రమణ

జరగలేదు జగతినందు.

వర్తమాన ప్రపంచాన మానవ

medhaku tattina

సందేహాలేన్నెన్నో

సమాదానాలెక్కడ

ఎవ్వరిదీ నిర్మాణం

ఎవరాతాడు విశ్వ

జగతి రూప కర్త

ఎవరాతాడు విశ్వ

విధి విధాన నిర్ణేత

అతడే అతడే అతడే

అండ పిండ

బ్రహ్మాండ నాయకుడ?

yemanduru ఆతనినేమందురు

అత్యద్భుత క్రమ శిక్షణ

విశ్వ భావ పరి రక్షణ

పృధ్వీ తల సంరక్షణ

నిర్వచించి నిర్వహించు

శక్తి భరిత యుక్తి పరుడు

ఎవడాతాడు ఎచతనుండు.......

అది మన బుర్రకు అందని ఆలోచనలేందుకు

ఇకిన్చుక తరచి చూడ

విశ్వంలో భూమి పాలు

పరమానువుకన్న చిన్న

యిక మనిషి వునికి ...ఎంతని..

అర్ధం చేసుకో అనర్ధం మాపుకో.

క్రోదోద్భవ అహంకార

విసృన్ఖల వికృత చేష్ట లు మానుకో

లేకుంటే మారణ హోమం

మానవ జాతికి మరణ శాసనం.

. రచన:నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:౧౦-౦౨-౨౦౦౯

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

సమర ప్రభోదం


అది ౧౯౬౨, భారత వుత్తర సరి హద్దులలో వుద్రిక్త పరిస్థితి.చైనా దురాక్రమణ కు సిద్ధపడింది.భారత భూ భాగాలను దౌర్జన్జంగా ఆక్రమించింది . నెహ్రూ గారు సంప్రదింపుల ద్వారా పర్స్కరించాలని ప్రయత్నం చేసారు. చైనా అద్యక్షులు శ్రీ మావో -సే - టుంగ్ తోను చైనా ప్రధాని చౌ -యెన్ -లై తోను ,సంప్రదింపులు జరిపి ఒక అంగీకారానికి వచ్చిమాక్-మోహన్ లైన్ అనే సరహద్దు ఒప్పందం చేసుకున్దామను కుని వూపిరి పీల్చుకున్నతరువాత అకస్మాత్తుగా మన సేనలు సిద్ధంగా లేనప్పుడు కుస్చిత యుద్ధ తంత్రంతో మన భూభాగం లో చాలా ముందుకు చొచ్చుకు వచ్చారు.సంప్రదింపులు మధ్య వర్తిత్వాలు అన్ని విఫలం అయ్యాయి.ఆ సమయంలో యుధం తప్పలేదు.పోరు ప్రారంభమైంది.ఇరు సేనలు అత్యాధునిక విమానాలతోను ఆయుదాలతోనూ పరస్పర దాడులు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రపంచ దేశాలన్నీ మన దేశానికిఅండ ప్రకటించాయి.
పేపర్లు ,రేడియోలు ద్వారా వార్తలు అందేవి . రేడియోలు ఎక్కడో ఒక ఇంట్లో వుండేవి ,సామాజిక రేడియో గ్రామ పంచాయతి లో ప్రజలకి అందుబాటులో వుండేది .ఏ ఊరికి విద్యుత్తు వుండేది కాదు, .....రేడియో, బాటరీ తో పని చేసేది. ఆ బాటరీ కూడా చాలా పెద్దగా వుండేది .ఇద్దరు మనుషులు పట్టి మొయ్యాల్సినంత పెద్దది అన్నమాట.
ఇళ్ళల్లో కిరసనాయిలు దీపాలే. వీధి దీపాలు కూడా అవే.ఆ రోజుల్లో పట్టణాలలోనూ ,కొన్ని గ్రామాల్లోను , నగరాల్లో వీధి దీపాలకు ,కొద్ది మంది ధనవంతుల ఇళ్ళకు తప్ప కరెంటు అందు బాటులో వుండేది కాదు.వూళ్ళల్లో వీధి దీపాలకు కిరసనాయిలు వాడేవారు.
కాని మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో ఒక్క మానికొండ అనే గ్రామంలో ఎవరింట్లోనో జెనరేటర్ తో కరెంటు కొన్న విషయం మీద ,అందరు ఆశ్చర్యంగా చర్చించు కొనే వారు. . (౧౦౬౨ నాటికి గ్రామాల స్థితి గతులు మీకు టూకీగా చెప్పాలనే తపన తో ఈ ప్రస్తావన.)ఇక అసలు విషయానికి వద్దాం.

వూళ్ళో రేడియోలో వార్తలు వచ్చే సమయంలో గ్రామ పంచాయతి ఆఫీసు వద్ద ప్రజలు గుమి గూడి వార్తలు, విశ్లేషణలు వినే వారు. పరిస్థితిని చర్చించే వారు.పరిస్థతి అవగాహన చేసుకొనే వారు.సినిమా హాళ్లల్లో యుద్ధ ప్రాంత దృశ్యాలు ప్రదర్శించే వారు.అప్పటి ప్రధాని పండిట్ జవహరలాల్ నెహ్రూ వుపన్యాసాలు కూడా సినిమా హాళ్లల్లో ప్రదర్శించే వారు.ఆ వార్తా చిత్రాలు సినిమా కు వచ్చిన వారి నందరిని వుత్తేజ పరిచేవి. చూసే యువతని మరీ చైతన్య పరిచేవి . సైన్యంలో చేరేందుకు యువత వరుసలు కట్టారు.
విద్యార్థులు,వుద్యోగులు , నటులు ,పత్రికల వారు , ఒకరని కాదు అందరు అన్ని వర్గాల వారు ,స్త్రీలతో సహా దేశ రక్షణ నిధి పోగు చేసి ప్రభుత్వానికి అందచేసారు. రాజకీయాలకతీతంగా , సైనికులకు కావలిసిన డబ్బును, వస్తువులను బట్టలను ,వున్ని దుస్తులను సమకూర్చారు.దేశమంతా ఒక్క తాటి పైన నిలచిన ఆ సందర్భం లో ,....

ఆ సమయంలో నేను కృష్ణ జిల్లా వుంగుటూరు లో వుండి చడువుకొంటున్నాను. ఆ వూళ్ళోని మా హై స్కూల్లో (నేను విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శి పదవి లో వుండేవాడిని )విద్యార్థులు అందరిని కూడగట్టి దేశ రక్షణ నిధి కొరకై విరాళాలు సమకూర్చే భాద్యతని నేను తీసుకోవడం జరిగింది.శ్రమదానం ద్వారా ఆ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాము.
విద్యార్థులతో దేశ రక్షణ నిధిని సమకూర్చే విషయమై సంప్రదించి వారి అందరి అనుమతిని పొందిన తరు వాత , మా ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.యస్ .రా వు గారికి మా అభిప్రాయం తెలియ చేసి నిధికి చందాలు ఎట్లా కూడగాట్టాలనే విషయ మై చర్చించాం. వూళో చందాలు వసూలు చేదామని ఆయన సలహా ఇచ్చారు. నేనేమో మా వ్యూహం తెలియజేసి మేము శ్రమ దానం ద్వారా వరి చేలు కోసి తద్వారా వచ్చిన మొత్తాన్ని దేశ రక్షణ నిధికి పంపాలనే (శ్రమ దాన కార్య క్రమంలో వారి చేలు కోయద మనే మాట అప్పుదికప్పుడు నేను తీసుకొని ప్రతిపాదించిన నిర్ణయం.)మా సంకల్పం ఆయనకు చెప్పాను.. ఆ ప్రతి పాదన ఆయనకు చాలా బాగా నచ్చింది..
ఆ ఆ రోజుల్లో స్కూలు విద్యార్థులు ఎవరికీ పాద రక్షలు వుండేవి కావు.అది కాక ఒక్క స్కూల్లో తోటపని చేసిన అనుభవం తప్ప ఏ వక్క విద్యార్థికి పొలం పనులు చేసిన అనుభవం లేదు ..ఆటకాయ తనంగా చేలల్లోనూ చేలగట్ల మీద ,బురద నేలలలోను తిరిగిన అనుభవం తప్ప.
(ఆ రోజుల్లో ఆ వూర్లో కంకర రోడ్లు కూడా వుండేవి కాదు.ఇప్పుడైతే సిమెంటు రోడ్లు వున్నాయి అనుకోండి .)
అప్పట్లో వర్షాకాలంలో మోకాటి లోతు బురద లో వెళ్ళాల్సి వచ్చేది. చెంబట్టుకొని కూడా అట్లా వెళ్లాలిసిందే మరి. వర్షా కాలంలో భయంకరంగా వుండేది. స్త్రీలు చాలా ఇబ్బంది పడే వారు.మరుగు దొడ్లు వుందేయి కాదు మరి. (ఇది మరీ అప్రస్తుతం అనిపించినా .....ఈ వ్యాసానికి అవసరమే).
డబ్బులుగా సేకరించ కుండా ,శ్రమ దానం ద్వారా , అదే నండీ ,విద్యార్తులందరం పని చేసి త ద్వారా వచ్చే శ్రమ ఫలితాన్ని నిధికి ఇచ్చే విధానాన్ని ఎన్నుకొని , కనీసం ఇరవై ఎకరాల మాగాణి కోత కోసి వచ్చిన డబ్బులు, దేశ రక్షణ నిధికి ఇవ్వాలని నిర్ణయించాం కదా ..
ఆ నిర్ణయం సరియినదేనా? ,పిల్లలు పంట పాడు కాకుండా చేతులు కాళ్ళు కోసుకోకుండా కోత కోయ గలరా?, వంటి అనేక సందేహాలు టీచర్ల లోను,మా ఊరి పెద్దల లోను తలెత్తాయి .ఆ విషయ మై చాల చర్చ జరిగింది. నల్గురు కలిసి ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలంటే అది ఎంత మంచి పనైనా ఒక గాట్లో పడటం అంత తేలిక అయిన విషయం కాదు.నాగలికి కట్టిన ఎడ్లు ఒకటి అటు ఇంకోటిటు, లాగితే దుక్కి సాగుతుందా ?ఊళ్ళో గ్రూపులుంటాయి కదామరి. దానితో రాజకీయాలూ తప్పవు.నాకు రాజకీయం లో బలపం పట్టు కోవడం అప్పుడే తెలిసిందనుకోండి.
ఊరి పెద్దల్ని ఒప్పించే భాద్యత ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.యస్ మూర్తి గారు , డ్రిల్లు మాస్టారు విష్ణు గారు తీసుకొని ,ఊరి పెద్దల్ని వప్పించారు. వారందరికీ మేము ప్రతి పాదించిన ప్రయోగం నచ్చింది. ముందు పది ఎకరాలు వరి పొలం ఒక కామందు (మా స్కూలు ప్రక్కనే)కోతకు ఇచ్చాడు... పెద్ద రైతుల దగ్గర కొడవళ్ళు తెచ్చుకొని , మొత్తానికి వరి కొత కోసాము. ఒక రకమైన తృప్తి,ఆత్మా విశ్వాసం మా అందరిలో.

అందరు ఊపిరి పీల్చుకొన్నారు. వరి పాడు కాకుండా కోసారనీ ఎటువంటి గాయాలు కాకుండా పని అయిందని,పెసర జనుము విత్తనాల తొక్కిడి కూడా బాగా అయ్యిందని,ప్రచారం జరిగి, మా చేలు కూడా కోయండి అని మరి కొందరు ముందుకొచ్చారు.మరో రోజు ఆ చేలు కూడా కోసాం . ఎవరికీ కూడా చేతులు గాని ,కాళ్ళు గాని తెగలేదు.ఎప్పుడు కొడవలి పట్టిన చేతులు కాదాయె.మొత్తానికి మా అందరికి పొలం పని మీద వుత్సాహం కలిగింది.అప్పటి వరకు వూళ్ళో వర్షాకాలంలో బురదలో తిరిగిన అనుభవం బాగా వుపయోగ పడింది.పిల్లలందరికీ జలగల గురించి ,నీళ్ళ కట్టే పాముల గురిచి,ఎన్ద్ర కాయల గురించి భయాలున్దేవి, అయినా ధైర్యంగా ముందుకొచ్చారు, ఆ సందర్భంలో వాళ్లు చెప్పిన విషయం మీ అందరితోనూ పంచుకు తీరాలి. అట్లా గయితే రోజు వారీ కూలీలు కూడా భయపడాలి కదా . వాళ్లకు లేని భయం మనకెందుకు?అని. వాళ్ల ధైర్యానికి ఆలోచనా విధానానికి నేను చాలా అఛెరువన్దాను.
కోత కోయగా వచ్చిన మొత్తం : రూ :౧౪౦౦-౦౦ రక్షణ నిధికి పంపాము. ఈ విధంగా శ్రమదానం ద్వారా నిధి సమకూర్చుకొన్న విధానం ,పంట చేలు చక్కగా కోసిన పధ్ధతి అందరి మెప్పును పొందాయి .అప్పటివరకు పిల్లలు పంట పాడు చేస్తారేమోనని భయపడ్డారు .దిన పత్రికల్లో అభినందన పూర్వక వార్త లు వచ్చాయి .అప్పటి రోజుల్లో మయా గురించి మా స్కూలు గురిచి ,అందరూ చాలా గొప్పగా చెప్పుకున్న సందర్భాలున్దేవి.

ఆ కార్యక్రమంలో పాలు పంచుకొన్న విద్యార్ధులను ప్రోత్స హించేందుకు నేను వ్రాసి ,పాడిన దేశ భక్తి ప్రబోధ గేయం ఇది .
ఆ సందర్భంలో మా వుత్శాహాన్ని ప్రోత్సహించి ,సహకరించిన అప్పటి హెడ్ మాస్టర్ శ్రీ పి.యస్ .మూర్తి గారు , ఇతర టీచర్లు ,ఊరి పెద్దలు, పాల్గొన్న తోటి విద్యార్థులు ఎంతగానో అభినందనీయులు.


దేశ భక్తి ప్రభోధ గేయం

కదలు కదలు కదలరా కదన భూమి కరుగారా

హిందూ దేశ వీర పౌర భరత మాత తనయుడా

వీర ధీర శూర పురుష భారత సేన సైనికుడా

నీదు భూమి భరతావని ఒక్క అంగుళం అయినను

అన్యుల కై ఒసగమని ప్రతిన చేయ రమ్మురా

మిత్రులని నమ్మితేను మిత్ర ద్రోహం చేసారు

శత్రులతో తలపడగా శ్రద్ధ తోను కదలరా

దుర్మార్గుల దునిమివేయ ధైర్యం తో సాగరా

భయం వదులు జయం కలుగు ధైర్యంతో ..

కదలు కదలు కదలరా కదన భూమి కరుగారా .

రచయిత ,గేయకారుడు :నూతక్కి రాఘవేంద్ర రావు . గేయ రచన :౧౯౬౨ జనవరి
ప్రచురణ తేది :౦౬-౦౨-2009

ప్రమాద ఘంటిక...రెడ్ అలెర్ట్


తేనె పట్టు పై దాడి జర్గు తుంది అని తేనె టీ గలు భావించి నప్పుడు అవి రక్షణ వలయాన్ని సృష్టించుకొనే యత్నం లో ఆందోళనతో తమను తాము పోరాటానికి సిద్ధం చేసుకొనే ప్రయత్నం ........ కవి వూహల్లో

కదలి రండి కదలి రండి

కడలి తరంగాల్లా

రండి బాబోయ్ రండి

త్వర త్వరగా రండి

సాయుధులై పరిగెత్తుక రండి రండి రండి

నెలలపాటు కట్టుకున్న

మనగూటిని కాపడుకొందాం

పూలనడిగి తెచ్చుకొన్న

తెచ్చుకొని దాచుకున్న

పూదేనియ దోచేందుకు

దొంగలమ్మో దొంగలు రండి రండి రండి !!

ముసుగేసుకు వస్తున్నరు

భయం వద్దు ధైర్యంగా

రండి రండి రండి

కుట్టి కుట్టి కుట్టి

వెంటపడి తరిమి కొట్టి

దాచుకున్న తెనేనంత

ఆ శత్రు మూక కింత కూడా

దక్కకుండా చూద్దాం

మనమే తాగేద్దాం రండి !!! రండి రండి రండి !!

మంట చేత బట్టి వారు

మన నెలవు కాల్చ జూస్తున్నరు

మనలను మాడ్చివేయ జూస్తున్నరు, రండి రండి రండి !!

బేల తనం వదలండి పిరికితనం మానండి

ముక్కులకు పదును పెట్టి విషం తోటి కుట్టేందుకు

రండి రండి వేవేగం పరుగెత్తి మీరు

కట్టే చేత బట్టి మనల తరిమి కొట్ట బోతున్నరు

మనలను చంపివేయ జూస్తున్నరు రండి రండి రండి !!!

వీరులారా ధీరులారా వెనుదిరగక పోరాడ రండి

శత్రు మూక ........మన చెంతకు

చేరక ముందే మనమంతా

నలువైపుల చుట్టముట్టి

దాడి చేసి కుట్టాలే

కుట్టి కుట్టి కుట్టి

తరిమి తరిమి కొట్టాలె రండి రండి రండి !!!

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు , తేది:౦౬-౦౨-౨౦౦౯.

5, ఫిబ్రవరి 2009, గురువారం

పరాన్న భుక్కులు

వాస్తు శిల్పులు ,గణిత కారులు
వుద్దండ పండి తులు
అంచనాలు తలక్రిందులు..
ఆ చిరు కీటకం సృష్టించిన
అద్భుత మహాద్భుత నిర్మాణ
కౌశలం ఎప్పుడైనా వూహించారా
ఈ భువి పై ఎచటనైన వీక్షించారా
తేనే పట్టు ఎటులుండునో గమనించారా


తెనంటే పడి పడి చస్తాం
తేనే టీగలకు భయపడి చస్తాం
క్షణ కాలం ఒక క్షణ కాలం
తేనే పట్టు పరికిస్తే
నిర్మాణపునైపుణ్యం
అత్యద్భుత ఆవిష్కారం!!
షడ్భుజి ఆకారపు వేల వేల గదులు
గదులన్నీ కలుపుకొంటూ తేనే తుట్టె మిగులు
గుడ్లకోరకు తెనేకోరకు వేరు వేరు గదులు

తూఫాను గాలి ఎండ వేడి
దేనినైనా తట్టుకొనే

పటిష్ట మైన తీరు లో
ఆకస హర్మ్యాల పైన
వ్రుక్షాగ్రాలపైన ,చెట్టు తొర్రలో ,


పుట్టల్లో లోలోతుల
ఆ మానవ జాతికి, జంతు జాలమునకు

భయపడుతూ భంగ పడుతు
ఆ అనల్ప జీవి .............

ఏళ్ళు పూళ్ళుకష్టించి గూళ్ళు కట్టి
తేనే ఈగలన్నీ పోయి పుష్పాలను
అర్ధిస్తూ వేడుకొంటూ
తేనే తెచ్చి కూడబెట్టి
దాచుకున్న
తమ శ్రమ ఫలితం
తమనోటికి అందనీక

దొంగ సచ్చినోల్లోచ్చి
నెలల పాటు నిర్మించిన
నెలవును చిద్రం చేస్తే

దాచుకొన్న దాన్ని కాస్త
దోచుకు పోతుంటే
కోపం కక్ష క్రౌర్యం క్రోధం ...

వెంటపడి వేటాడి
పట్టి పట్టి కుట్టి కుట్టి
వెతల పాలు చేసినా
బలవంతునిదే
రాజ్య మంటూ
దౌర్జన్యంగా వారు .....రచన: నూతక్కి రాఘవేంద్ర రా వు
తేది :౦౫-౦౨-2009


చద పురుగులు.

ద్వేషంగా చూడకు వాటిని

చీదరపడి పడి క్రోధంగా


హీనంగా చూడకు వాటిని

వేగిరపడి క్రూరంగా

విజ్ఞతతో యోచించి చూడు

వివేచనతో పరికించి చూడు


కార్యాన్కిత కార్యాన్విత

జీవ సహ జీవన గమనం.

వాస్తు శిల్పి, కళా తపస్వి,

దీక్షా దక్షా పూరిత

ధన్యజీవి నిస్వార్థ జీవి

సంఘ జీవి కర్మ జీవి

కోట్ల కొలది ఆ జీవులు

స్వజీవజాల సంరక్షనార్థమై

స్వయం సృజిత నిర్మాణం

ఎన్నెన్నో యోజనాలు

రాత్రనక పగలనక

ఆకలి దప్పులు మరచి

తిరిగి తిరిగి అలసి సొలసి

మట్టి కరచి పుట్ట పెట్టి,

మాను కరచి గూడు కట్టి

పట్టిన పని వదలనట్టి

క్రమ శిక్షణ కల యోధులు

ఆ సూక్ష్మ జీవి ఆశల పై

ఆ జీవి కన్న సంతితి పై

ఆ వాస్తు కళా తపస్విపై

పాదమేసి నలిపి వైచి..

అతి దారునమామానిసి


రచన:నూతక్కి రాఘవేంద్ర రావు తేది :-౦౨-2009

భూకంపం

అది కావచ్చును నిదురలోని చేష్ట

ప్రక్రుతి పురుషుని ఒడిలో

శయనించిన జ్ఞాపకాల పరవశాన

భూమాతకు కలిగినట్టి పులకరింత

కావచ్చును కావచ్చును

అలసిన ఆ ప్రుద్వీమ తల్లి

కలత నిదురలోని చేష్ట

కాని ఆక్షణాన!!!

ఆక్రందన ఆవేదన

భూన భొంత రాళా లలొ
దద్దరిల్లి భూ కంపన

అహో రాత్రాలు శ్రమియించి

నిర్మించిన ఆ మానవ నిర్మిత

భవన సముదాయాలేన్నెన్నో

పునాదులతో కూలి పోయి

వేల వేల జీవితాలు ఆ శిధిల

శకలాల క్రింద నలిగి విరిగి మరణిస్తే

ఆ కాళ రాత్రి ఆ నిర్భర నిశీధి

అంధకార బంధురమై

విక్రుతమై ప్రక్రుతిచేసిన

వికటాట్టహాస విశృంఖల నృత్య హేల

అతి క్రూర భయంకర మృత్యు క్రీడ

ఎం జరిగిందో తెలియదు

అచేతనావస్థలో అంతు

తెలియని అయోమయం.

పాపం ఆ భూమాతకు

గర్భ శోక భారం బాధా భరిత శోకం

ఆక్రందనం యెంత కష్టం

తన చుట్టూ తను తిరుగుతు

సూర్యుని చుట్టూ పరిభ్రమణ

అలుపంటే తెలియకుండ

క్రమ పధాన పయనిస్తూ

తననే నమ్ముకున్న తనపై

నడయాడే జీవకోటి పరి రక్షణకై

ఏమారని క్రమ పయనం

రేయి పగలు కల్పిస్తూ

అలసి సొలసి ఆ ఒక్క క్షణం

తత్తర పాటున జరిగిన

దుర్భర ఘటనాక్రమం

ఘోర భయంకర ప్రళయం

అతి భీకర భూ కంపనం . రచన: నూతక్కి రాఘవేంద్ర
రావు తేది: ౦౫-౦౨-2009

4, ఫిబ్రవరి 2009, బుధవారం

నిరంతర వేదన


ఒక జంతు ప్రదర్సన శాలను దర్శించినపుడు నేను చూసిన దృశ్యం నా మనసును కలచి వైచి, అను నిత్యం నను వెంటాడుతూ......ఒక రాట్నపు చక్రం తిరుగతూ అందులో వున్నతెల్ల ఎలుక పిల్ల ,ఆ చక్రం లోనే పడిపోతాననే భయముతో పరిగిడుతోంది.అది ముందుకు పైకి పోతూండటంతో చక్రం తిర్గుతూనే వుంటుంది. జనం వింతగా చూస్తున్నారు . రాట్నం ఆగేదేప్పుడు?పరుగు ముగిసేది ఎన్నడు? అప్పటి వరకు ఆ జీవి ఆసతో, నిరంతర వేదనతో ......పరిగిడుతూనే .. గమ్యమేక్కడో తెలియదు పాపం .

తిరుగాడుతూ రాట్నం
వేగంగా అతి వేగంగా
పరుగిడుతూ ఎలుక పిల్ల.
ఇన్కెన్తో దూరం లేదు
దగ్గరలో అతి దగ్గరలో
మనసిచ్చిన ధైర్యం
ఆరాటంలో
ఆరాట్నం లో
అలసటతో
వేసటతో ...ప్రస్తానం కొరకు.

తరలి పోతూ ఆకారాలు
chooda వస్తూ కొత్త మొహాలు
జన వాహినిలో
గమ్యానికి చేరువలో
భ్రమలో ఆ భ్రమణంలో
వేగంగా అతి వేగంగా ...

సంభ్రమమే
పిల్లలు పెద్దలు
ఆనందపు కేరింతలు ...

అవధి లేని పయనం
అర గంట ..గంట... మరో గంట
గడుస్తూ కాలం
అయోమయం
అగమ్య గోచరం
అవిశ్రాంత పయనం

అలసి సొలసి పరిగిడుతూ
పాపం ఆ అభాగ్య జీవి.
తెల్లని ఆ ఎలుక పిల్ల !!

'క్రూరులు కారే యా మానవాధముల్
కారుణ్య మికిన్చుక జూపగలేరు
దారుణా నందము పొంద జూతు రదేలనో
ధారుణి లోని నికృష్ట దురాన్తక జీవముల్ ' రచన:నూతక్కి
రా ఘవేంద్ర రా వు తేది : ౦౪-౦౨-2009

2, ఫిబ్రవరి 2009, సోమవారం

చిలిపి జ్ఞాపకాలు


చిన్నప్పుడు ఆడవాళ్ళు చీటికి మాటికి ,చిన్న వాళ్ళని తిట్టాలంటే చచ్చినాడా అనో చచ్చినోడా అనో తిట్టే వాళ్లు.ఈ తిట్లు గ్రామీణ ప్రాంతానివి కదా కొంచెం జానపద స్టైల్లో సచ్చినోడా అంటే బాగుంటుందని నా భావన.చిన్నప్పుడు ఎన్నెన్ని తిట్లు తిట్టేవాళ్ళు !! హమ్మో !! ఒకటా.. రెండా!!!

వాళ్లు తిట్టడం లో న్యాయ అన్యాయాల గురించి ఏమో గాని , ముందు నా బాధ కొంచం వినండి.ఎంత అన్యాయం ! ఆ ఆడాళ్ళ ఆ తిట్లు !! హన్నా !! అన్నీ నన్నే తిట్టాలా? అట్లా నవ్వకండి,మిమ్మల్ని తిడితే మీకు తెలిసొచ్చేది.

సచ్చినోడా,జిమ్మదియ్య ,నీ పా డి గట్ట ,నీ దివసమార ,నీ కళ్ళల్లో దబ్బనాలు గుచ్చ ,నీకు పొయ్యే కాలం రానూ ,నీకు అక్క చెల్లెళ్ళు లేరూ ,నీ నాలిక తెగ్గొయ్య ,నీ కాళ్ళు విరగ ,నీ చేతులిరిగి పోనూ ..

అయినా ఈ ఆడాళ్ళుఏ తిట్టు తిట్టినా ఆ తిట్లలో నాకు బాధ అనిపించేది కాదు . నేను చేసిన పనులు అట్లాంటివి కదా .. తిట్టకుండా ఎట్లా వుంటారు పాపం .ఏం చేసానని మాత్రం అడక్కండి .ముందు ముందు మీకే తెలుస్తుంది లే. అందుకనే యిక్కడ ఆ ప్రస్తావన తేవడం లేదు .

మొగాళ్ళ తిట్లే నాకు చాలా అన్యాయంగా అ నిపించేవి. నేను తప్పు చేస్తే నన్నే తిట్టాలి కాని అమ్మల్ని అక్కలని ,అయ్యలని తిట్టడం నాకు మాత్రం నచ్చేది కాదు .నీయమ్మ ...నీయక్క , నీ చెల్లి ,నీయవ్వ యింకా కాదంటే నీయాలి అని మొదలెట్టి పచ్చి బూతులు అదేనండీ బండ బూతులు ..మీకెట్లా చెప్పాలో నాకు తెలియటం లేదు గాని ....ఏమి న్యాయం మీరే చెప్పండి ? అందుకే నేనెప్పుడు మగాళ్ళ తిట్ల జోలికి పోలేదు .మీరు నన్ను న మ్మాలి. బూతులు తిట్టలేని వాడు ,యీల వేయలేనివాడు,చెట్టుకు రాయి యిసరలేనివాడు .........వాడేం మగాడని చాలా మంది ఆడపిల్లల....వాళ్ళే కాదులెండి అనేక మంది ఆడవాళ్ళ అభిప్రాయం కూడా ననుకోండి,దానికి నేనేమి చెయ్యాలో చెప్పండి? ఎందుకో ఆపనులన్ని నాకు చెయ్యాలని అనిపించేవి కావు.

వూళ్ళో రోడ్ల మీద నడిచినా గోడల మీద పరిగె ట్ట ట మంటే చాల సరదా . గోడలెక్కి గోడల మీదే పరిగెత్తే వాడిని .గోడ ఆగి పొతే మరో గోడ.....వూళ్ళో అందరిళ్ళకి ప్రహరీ గోడల్లున్నై మరి, నేనేమి చెయ్యను చెప్పండి ?అలవాటు మరి.

ఆ గోడల మీద పరిగేట్టేతప్పుడు ఏదో దొడ్లో ఆడాళ్ళు స్నానాలు చేస్తుంటారు కదా ,కదా ఏమిటండీ తప్పా .మరి బాత్ రూమ్ లు వుండేవి కావు కదా.చు ట్టూ గోడలున్నాయని ధైర్యంగా బయటే స్నానం చేసేవాళ్ళు.ఏ గుడ్డ ముక్కో అడ్డంగా కట్టుకునేవాళ్ళు చాటు కోసం.కాని గోడ మీదుండే వాళ్లకు ఇదో అడ్డమా చెప్పండి . మరి అట్లాంటప్పుడు అటు చూడకుండా కుదురుతుందా చెప్పండి. దానికి కూడా తిట్లేనాయే ... వీడి కళ్లు పడిపోను అని తిట్టాలా? నేను చాల చిన్న వాడిని కదా , కనీసం అర్ధం చేసుకోవద్దూ? నా ప్రయాణం లో ..అదేనండి బాబూ గోడల మీద ..., ఒక్కో సారేమో కొందరు (కొందరే లెండి వూళ్ళో అక్కడక్కడ) ఆడ పిల్లలు వాళ్ల పక్కింటి మొగ పిల్లల్ని కావిలించుకొని కనిపించేవారు.నేనేమో చూడకుండా పోవచ్చు కదా..అయినా నేనెందుకు వూరుకొంటాను చెప్పండి , ఏంటే, నేను కూడా రానా ... కావిలించుకోనా , అని పాట పాడే వాడిని. అంతే ! తిట్ల దండకం !ఇదెక్కడి న్యాయం చెప్పండి.వాడికొక న్యాయం ,నాకొక న్యాయమా.

ఆడాళ్ళు తిడితే నాకేమి అనిపించేది కాదు కాని . ఆ కుర్రాడే బూతులు అందుకునే వాడు. నేను ఎవరికి చెప్పనని అన్నా సరే . ఎం చేయాలి మరి ,నేనేమో రాళ్ళు విసిరే వాణ్ని ..గోడమీద నించి కిందికే సుమా. పైకి విసరడం రాదు కదా మరి.

ఒకో సారేమో గోడ పక్కన మంచి మంచి పళ్ళ చేట్లున్దేవి .మంచి వాటిని మంచి అనుకోవడం లో తప్పులేదు కదండీ .అట్లాగే మంచి వాటిని వదులుకోనూ లేము కదండీ ..అందుకనే నేనేమో ఆ పళ్ళ నేమో కోసు కొనే వాడి ని కదండీ .మరి అవన్నీ నేను రోజూ తిరిగే చోట్లే కదండీ ,ఆ మాత్రం చనువు తీసుకొంటే తప్పేట్లా గవుతుందండీ?అయినా అంత మంచి పళ్ళు ,నా రింజ ,బత్తాయి,ఉసిరి, ,జామ, పనస అందరి దొడ్లల్లో అన్ని వుండేవి. ఎప్పుడూ ఒక్క దగ్గరే కోయం గదండీ. అసలు కోయ కుండా వుండగలమా చెప్పండి .నేనేదో తప్పు చేసి నట్లు తిడితే నాకు కోపం రాదా చెప్పండి .

ఒక సారేమో నాలుగో యింట్లో ,కిటికీలోనుంచి లోపల ఏదో కడులుతున్నట్లుంటే పరికించి చూసా ,మామ్మ మరో మగాడు మంచం మీద దోర్లుతున్నట్టుగా అనిపించి బాబాయి అనుకొని , బాబాయి ఎప్పుదోచ్చాడే మామ్మా అన్నా ,అంతే వాడు పంచె చుట్టుకుంటూనే పరుగో పరగు .. మామ్మ కు ఏదో సాయం చేస్తా వుండి వుంటాడు .పాపం నేనే పాడు చేశా.. కొంచం ఆవతలికి పోయి చూద్దును కదా వాళ్ల పా లే రే . బాబాయి వచ్చా డనుకొన్నా రా అన్నా. వాడేమో పారిపోతుంటే ....పరిగెత్త మాక పడతావు. బాబాయికి చెప్తాలే నువ్వు పడక మంచం లో మామ్మ కు సాయం చేసావని అన్నా.అంతే వాడేమో పెద్ద రాయి తీసుకొని కోపంగా కొట్టబోయాడు .తప్పుకున్నా గాని లేకుంటేనా ...

బాబాయి రెండు రోజుల క్రితమే వూరెళ్ళాడు కదా వచ్చాడనుకుని అడిగానంతే గాని ,నాకు వేరే ఏ వుద్దేశ్యం లేదు నమ్మండి.మీరే చెప్పండి నేనేమన్నానని, ఎట్లా చచ్చేది వీళ్ళతో ,చిన్న పిల్లలంటే అందరికి అలుసే కదండీ .ఎవరూ అర్ధం చేసుకోరాయే .

ఇట్లా ఎంత కాలం గోడల మీద తిరుగుతాం చెప్పండి ..అందుకే పోలాలెంట తిరుగుదామనిపించి నా గాంగ్ నేసుకుని బయలు దెరానొకసారి .నా గ్యాంగు లో ముగ్గురు మాంచి స్నేయుతులున్దేవారు. వాళ్ళేమో ఒకడు వుమ్మి గాడు,రెండో వాడు దాసు గాడు, మూడోవాడు చందు గాడు.

నా దగ్గర పాల బెల్లం, నువ్వు జీడీలు ,వేయించిన శనగ పప్పులు,వేయించిన వేరుశనక్కాయలు ,ఎప్పుడూ జేబుల్లో వుండేవి. పాల బెల్లం, నువ్వు జీదీలేమో వెంకట్రామయ్య కొట్లో నాన్న గారి పేరు చెప్పి తెచ్చుకొనే వాడిని .వేయించిన శనగ పప్పు, వేరు శనక్కాయలు , ఇంట్లోనే పెద్ద పెద్ద డబ్బాల్లో వుండేవి. అవన్నీ జేబులనిడా నింపే వాడిని.వాళ్ళకి అప్పుడప్పుడు ఏదో ఒకటి పెడతా వుంటే వాళ్లు నేను చెప్పిందల్లా చేసే వాళ్ళు. ఒకోసారి నాకోసం వాళ్లు దెబ్బలు కూడా తినే వాళ్లు.

అందరికంటే నాకు మంచి స్నేహం నా చెల్లెలు తోటి. తను కూడా ఎప్పుడూ నాతోనే వుండేది. ఒక సారి మా చెల్లి దగ్గర నుంచి మా తోటలో, మా మామిడి చెట్టు కాయ, నేను కోసిస్తే,వుమ్మిగాడు లాక్కున్నాడు .మా చెల్లెలేమో ఏడ్చేసింది .

దాంతో నాకు కోపం ఒచ్చి రాయి తీసుకునివిసిరా ,చెట్టు మీదనుంచే సుమండీ ,అది అంత గురిగా వాడి నడి నెత్తిన తగిలి కంత పడి భోల్లున రక్తం కారుతుందని నాకేం తెలుసండి .మా చెల్లేమో భయపదిందేమో తోట నుంచి పారిపోయింది ,వుమ్మిగాదేమో ఎడుచుకుంటావాడు వెళ్లి పోయాడు. మిగిలినాల్లేమో నాతొ నువ్వట్లా కొడతా వుంటే నీతో పచ్చి అని అక్కడే మోట భావి దుంగల మీద కూర్చున్నారు. నాకేంచెయ్యాలో పాలు పోలా. కిందకి దిగొచ్చి బతిమాలాడు కొన్నా.నేనేం చెయ్యను చెప్పండిరా .చెల్లిని కొడితే వూరు కొను కదా . మీరుకూడా వూరు కో కూడదు .మీలో ఎవరు

అట్లా చేసిన నేనంటేనేనంతే చేసే వాడిని. సరే పదండి వాడిని బతిమలాడి మనతోనే వుండేటట్టు చేసుకుందాం . అని వాళ్ళతో బయలు దేరి వస్తా వుంటే ఈత చెట్ల మీద కుండలు కనిపించినై .ఆ క్యల్లు కుండ లంటే నాకు చాల చిరాకు. దానికో కారణ ముందిలెండి. అది తరవాత చెబుతా.

దాసు గాడి దగ్గర ఎప్పుడు వుండేలు వుంటుంది .వాడిని రెచ్చగోట్టా.ఎరా దాసుగా నీ దగ్గర వుందేలుంది కదా ఎప్పుడైనా గురి చూసి కొట్టావంటారా అని.వాడికేమో వుడుకొచ్చి ,ఎమనుకొనావురా చూస్తావా నా వుండేలు దెబ్బ అన్నాడు,చూపించారా ,ఆ కుండల్ని వరస బెట్టి కొట్టు ,అన్నీ పగలాలి అన్నా. అంతే ఆ కుండలన్ని వరస బెట్టి పగిలి పోయి చెట్టు నుంచి వర్షంలాగా కల్లు కురిసింది.అంతే అక్కడ వుంటే వట్టు.అట్లా సారా కుండలు కూడా పగలగోట్టేవాళ్ళం.దొరికే వాళ్ళం కాదు గాని మాకు మాత్రం చాలా భయంగా వుండేది.ఎక్కడ కట్టేసి కొడతారో నని. అప్పట్లో మా వూళ్ళో తాడి చెట్లు ఈత చెట్లు చాలా ఎక్కువ.ప్రతి మెట్ట చేను చుట్టూ తాడి చెట్లు ఈత చెట్లు వుంటాయి,మధ్య మధ్య వేప చెట్లు ఇతర చెట్లు తీగలు పెరిగి అవి దట్టంగా కంచేలాగా వుండికంచె దాటాలంటే భయంగా వుండేది. పాముల పుట్టలు చాలా వుంటాయి కదా. ఎన్నో రకాల పాములు,జెర్రులు తేళ్ళు ముంగిసలు ,ఎన్నో వుంటాయి. మరి భయ మేయ్యదేంటి?అదీ కాక ముళ్ళ కంపలు.మాకు చెప్పులు కూడా వుండేవి కావు.కాలేజీ కి వెళ్ళే వాళ్ళకే పాంట్లు చెప్పులు కొనిచ్చే వాళ్లు .పొలం పనులకేల్లెవాల్లకి కుట్టిన చెప్పులున్దేవి , మన దొడ్లో గేదలు కాని ఆవులు కాని చచ్చి పొతే వాటిని evaro వచ్చి తీసుకెళ్ళే వారు. తరవాత తోలు తీసి నానబెట్టి వూన్చి కొంత తోలు తో ఇంట్లో వాళ్ళకి పాలేళ్ళకి చెప్పులు కుట్టేవాళ్ళు'. ఈ సంగతి మా నాయనమ్మ చెప్పింది లెండి. యజమానికి మాత్రం కిర్రు చెప్పలు కుట్టేవాళ్ళు ,మోటలకి తొండాలు కుట్టే వాళ్లు..మిగతా తోలుతో చెప్పులు కుట్టి అమ్ముకొనేవాళ్లు.పిల్లలికి ఆడాళ్ళకి మాత్రం ఏమి వుండేయి కాదు. ఇదెక్కడి అన్యాయం చెప్పండి.

ఇక పోతే ఇక్కడే నా బుర్రకి తెలిసి నంత వరకు ఒక సంగతి మీ అందరికి చెప్పాలనుకుంటున్నా .ఏమాత్రం చిలిపి సంగతులు కావండీ .సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా నంతే .

ఇట్లా వూళ్ళో ఆన్నిరకాల పనులు చేసే వాళ్లు వుండే వాళ్లు. వాళ్ళందరికీ వేరు వేరుగా స్థలాలు ఇచ్చి ఊళ్ళో వుంచుకునేవారు.చాకలి, మంగలి, వడ్రంగి, కంచరి, , కటిక, మేదరి ,గౌండ్ల ,ఎరుకల, పాముల యానాది ,సాతాని వగైరా వృత్తుల వాళ్లు ఊరి లో ప్రజలకు కావలసిన వస్తువులు చేసి పెట్టడం లోను, యింటి పనులు ,వ్య్వసాయాయ పనులు చేసి పెట్టడం లోను రయితులకి , వాళ్ల కుటుంబాలకి, సహాయ పాడేవాళ్ళు. వాళ్ళందరికీ సంక్రాంతికి కుప్ప నూర్పిల్ల లోనో ఇతర పంటల చేతికి వచినప్పుడో ఇంతని భాగ మిచ్చే ఆనవాయితీ వుంది .వీళ్ళే కాక గుళ్ళల్లో, ఇళ్ళల్లో పూజలు చేయడానికి అబ్దికాలు గృహ పూజలకు పూజార్లు వుండేవారు. వారందర్కి కూడా సంక్రాంతికే సంభావనలన్దేవి.ఇంక పొలాల్లో ఎలుకలు పంటలు పాడు చేసేవి,అట్లాగే పాములు వాటికోసం..అందుకుగాను పాములు పట్టేవాళ్ళు ఎలుకలు పట్టే వాళ్లు గూడా పోషింప బడేవాళ్ళు. చేటలు, జల్లెళ్ళు బుట్టలు జల్లలు అల్లేవాళ్ళు, బట్టలు నేసేవాళ్ళు అందరు పరస్పరం ఆధార పడి అంతిమంగా సంక్రాంతి పంటల కోసం ఎదురు చూసేవాళ్ళు. రైతు బాగుండాలని పంటలు పండాలని అందరు కోరుకునేవాళ్ళు.ఈర్ష్య ద్వేషాలు తెలియని ఆ కాలంలో మావూళ్లో నేను ఆ రోజుల్లో మా వూరంటే నాకు ఎంత గర్వంగా వుండేదో. పదహారు సంవస్తరాలే ఆ వూర్లో పెరిగినా ఆ ఊరికి యింత దూరంగా ఈ యాభై సంవస్త్సరాల ఆ జ్ఞాపకాలు ఇంత నేవళంగా అదో ఒక అద్భుత భావన. అసలు

చిలిపి కబుర్లు మానేసి ఒక్క సారిగా సామాజిక శాస్త్రంలోకి పంపింది మా వూరు. ఇంకా ఎన్నో చిలిపి కబుర్లు చెప్పుకోవాలి కదా. ఇప్పటికి నన్నొదిలెయన్ది ,చిన్నాడిని కదా ఆకలేస్తాంది.