26, ఏప్రిల్ 2010, సోమవారం


చీకటిలో వెలుగు

24, ఏప్రిల్ 2010, శనివారం

కాక తాళీయంగా మువ్వురు ప్రముఖులతో యీ సాయంత్రం ....

ఈ రోజు నాకు ప్రముఖ చిత్రకారుడు "శ్రీ బాలి ని" కలిసే ఆవకాశం కలిగింది.ఆయన కార్టూనిస్తే కాదు మంచి కధా రచయిత అని వారిని కలిసినపుడే తెలిసింది. ,చక్కని గాయాకుడని వారు పాట పాడి వినిపించినపుడు తెలిసింది.రేఖల్లో ఆయన గిసిన చిత్రాలు చూసి అబ్బురపడిన రోజులున్నాయి.అనుకోకుండా ముఖతహా వారిని కలిసే ఆవకాశం వచ్చినప్పుడు అబ్బురమనిపించడంలో ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి ?
యీ సాయంత్రం వాకింగ్ కు వెళదామని ఇంటి బయటికి వస్తూ వుంటే పులిగడ్డ విశ్వనాధ రావు గారూ ,పురాణం శ్రీనివాస శర్మ గారూ ఎదురొచ్చారు. మీరు బయటకు వెలుతున్నారేమిటి ? బాలిగారు వస్తున్నారు. మిమ్మల్ని పిలుద్దామని వచ్చామని చెప్పారు. వెంటనే నా వ్యాహ్యాళి వాయిదా పడింది.బాలిగారిని కలిసే ఆవకాశం కలిగింది.
థాంక్స్ టు పులిగడ్డ వారు, థాంక్స్ టు పురాణం గారు. శ్రీ పురాణం ......వీరు స్వర్గీయ శ్రీ పురాణం సుభ్రహ్మన్యసర్మగారి పుత్రులుస్వతహా రచయిత ,ప్రముఖ పాత్రికేయులు.

యీ సందర్భంగా పులిగడ్డ వారిని గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలి. తెలుగులో హాస్యకధలు వ్రాయడంలో వారికి వారే సాటి.వారి కధా సంకలనం కలియుగ కృష్ణార్జునులు గురించి మునిపల్లె రాజు గారు అంటారూ ,...యీ సిద్ధహస్తుడి హాస్య రచనలో విడదీయలేని తాలింపు పదార్ధాలు...వక్రోక్తి,అతిశయోక్తి, శ్లేష ,హేళన,లక్ష్యాన్ని గురి తప్పకుండా చేరే మహా ఘాటు శర పరంపరలు అంటారు. .

కాక తాళీయంగా యీ సాయంత్రం