25, ఫిబ్రవరి 2009, బుధవారం

పందికొక్కులు



పందికొక్కులు


-------------



పంది కొక్కుల్లా ఎగబడి తింటున్నార్రా అని కోపం వచ్చినప్పుడు పిల్లల్ని అంటాం. పనాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వాళ్ల నంటాం ఒరే పంది కొక్కుల్లా ఎగబడి తిన్దేవిట్రా అని.ప్రజల మీద పడి పంది కొక్కుల్లా దోచుకు తింటున్నార్రా అని ప్రభుత్వ వుద్యోగాసుల్నీ అంటాం. అట్లాగే రాజకీయ నాయకుల్నయితే వదిలి పెట్టం కదా.దేశాన్ని దోచుకు తింటున్నారు పంది కొక్కుల్లా అని అంటామా లేదా. మాట జనజీవన విధానంలో వూత పదం అయ్యింది. అది మన రాజ కీయ నాయ కులకి సరిగ్గా సూటయ్యే పదం అంటాడు మా వెంకట్రావుడు.నాకేమి తెలియదనుకోండి.ఇంతకీ పందికొక్కులు తినేదంతా పాడు చేసేదేంత? ఎవరికయినా వివరాలు తెలిస్తే చెప్పండి బాబూ.ప్రభుత్వోద్యోగులతోనూ రాజకీయనాయకులతోను సమంగా తిన్నయ్యన్కోండివాటితో పోల్చడం తప్పేమీ కాదు. అట్లా కాకుండా తక్కువ తింటే మాత్రం వాటిని ఆడిపోసుకోడం చాల పాపం. మనకి పుట్ట గతులు వుండవ్.. వాటి శాపం మనకి తగిలితే కష్టం. అందుకే ఎవరైనా లెక్కలు సేకరించి పెట్టి పుణ్యం కట్టుకోండి బాబూ.మాటలు జాగ్రత్తగా వాడి మనం జాగ్రత్త పడదాం.


పాపం అవేం చేశాయని వాటిని ఆడి పోసుకుంటారు.పోయి పోయి అట్లాంటి వాళ్ళతో పోలిస్తే పాపం అవి మాత్రం ఎంత అవమానంగా ఫీలవుతయండీ. నీసం ఆలోచించ కుండా మాట్లాట్టం ఏం బాలేదు.సీజనున్నప్పుడు దాచుకోవడానికి ఎచేలోనో పడి లేక పొతే పురినో కొట్టి కాసిని ధాన్యం గింజలు, మెత్తకోసం కొన్ని గడ్డి పరకలు నోటకరుచుకు పోతాయి.అంతే గాని వేలకు వేల ఎకరాల భూమి బినామి కంపెనీల పేరుతొ స్వాహా చెయ్యవు కదా. ఏదో శ్రమదానంతో ఒక కలుగు తవ్వుకొని ముందు రొజుల్లొఅవసరమౌతుయ్యని కావలిసిన ధాన్యం ,పప్పులు వగైరా దాచి పెట్టుకున్తయ్యి. మహా అయితే అవి నోట కర్సుకేల్లెదేంతని ,రోజుకు నాలుగు సార్లు తిరిగితే తడవకి యాభయ్ గ్రాముల చొప్పున రెడొందల గ్రాములనుకోండి ,


చేనుకి పదికంటే ఎక్కువుందవండి అట్లా చూసుకున్నా రోజుకు రెండు కిలోలండి. పంట కాలం మొత్తం నెల రోజు లనుకోండి ,మహా అయితే అరవ్య్యే గదండీ కిలోలు.అంత అమాయక ప్రాణుల్ని పట్టుకొని దోచుకున్టున్నాయనడం ఏం బాగండి,అన్యాయం కదా? దేనికయినా న్యాయం వుండాలండి.అంత కష్టపడి దాచుకొంటే పంట భద్రం గా వుంటుందన్న నమ్మకం వుండదండి. వర్షాలోచ్చినప్పుడు కలుగుల్లోకి నీళ్లు చేరి దాచుకున్న ధాన్యమంతా పాడాయి పోతుందండీ. వాటికి స్విస్ బంకులు లేవు గదండీ .దోచుకున్నది దాచుకోడానికి.వాటికుండే ఇబ్బందులు వాటికుంటాయి కదండీ.మనం పండించిన పంట దాచుకోవదానికే గోదాముల్ని అవసరం మేరకు కాదు అవసరం గుమ్మడి కాయంత అందుబాటు ఆవ గింజంత .ప్రభుత్వం ప్రణాలికలు పెట్టి ఆసొమ్ములు కాంట్రాక్టరు ద్వారా రాజకీయ నాయకులు భోన్చేయడానికి తరలించాక తప్పదు కదండీ.వాళ్లు ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టుకోచ్చారాయే.ఏదయినా పందికోక్కులతో పోల్చాడ అన్యాయం కాదండీ.ఎప్పుడైనా చూసారండి దాచుకున్న ధాన్యం ఖర్చు పెట్టి పంది కొక్కులు ఎన్నికల్లో నిలబడటం ,?అంతేలేండ్ సారూ నోరు లేనోల్లని ఎన్నయినా అంటారు.న్యాయానికి న్యాయం లేదు కదండీ.


రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.తేది:౨౭-౦౨-2009

కామెంట్‌లు లేవు: