1, అక్టోబర్ 2009, గురువారం

తొట్రుపాటు

తొట్రుపాటు
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:27-09-2009
కాబోలది గగురుపాటు
కాబోలును జలదరింపు
కాబోలును కాబోలును
ఆ తనువున పులకరింపు
యుగ యుగాల నిద్ర నుంచి
ఆవులించి వళ్ళువిరచి
మత్తు మత్తుగా
మరల పవ్వళించినట్లు
అదియంతా క్షణకాలపు
ఆ నిద్దురలేని చేష్ట
కాలపురుష ప్రియుడిచ్చిన
ఆనందపు అనుభూతులు
హ్రుదికొనలో రగిలించిన
తొట్రు పాటుకావచ్చును

3 కామెంట్‌లు:

kannaji e చెప్పారు...

నమస్తే రాఘవేంద్ర రావు గారు ,
ధన్యుణ్ణి .. ఈ రోజే మీ బ్లాగ్ చదివాను ...చాలా మట్టుకు కవర్ చేసాను ...
మీ శిలా శిశువు నాకు బాగా నచ్చింది సుమండీ ...

శివ చెరువు చెప్పారు...

నమస్కారమండీ.. మీ బ్లాగు బాగుంది.. పదాల వాడుక చాల గొప్పగా ఉంది.. దయ చేసి ముఖ స్తుతి అనుకోకండి.. మీరు రాసిన నాకు అన్నిటిలోకీ విరహ మనస్కిని బాగా నచ్చింది.. మాది భద్రాచలం... బహుశా రాముని సన్నిధిలో 23 ఏళ్ళు గడిపినందుకు కామోలు..గత కొద్ది నెలలుగా కొత్త టపాలేమీ ప్రచురించలేదనుకుంటాను.. మీ ఫోటో సంప్రదాయాన్ని గుర్తు చేస్తోంది.. నాకు 40 ఏళ్ళు దాటాక పంచె కట్టులోనే ఉందామనే ఆశయముంది .. మీ బ్లాగు దర్శనం సంతోషకరంగా ఉంది.. ధన్యవాదాలు..

మానస సంచర చెప్పారు...

మాష్టారూ!

కవిత చాలా బావుంది.

మీరు నా కవితల మీద ఇచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడే చూసా. మీ బోటి పెద్దవారు నా టపాలు చదివి ఓపికగా వ్యాఖ్య రాయడం ఆనందంగా ఉంది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.