5, ఏప్రిల్ 2009, ఆదివారం

తెంపరి

తెంపరి

భయంకర యంత్ర దంష్ట్రాలతో

భయభీకర రసాయనాలతో

ప్రాణాంతక విష వాయువులతో

విష సర్ప సదృశ విద్యుద్ఘాతాలతో

క్షణ క్షణం భయం భయం

ఒక్క క్షణం నిశ్శబ్దం

మరుక్షణం భయ భయ భీకర గర్జన

మసలుతున్న మరుగుతున్న

ద్రవ లోహపు ప్రేలుళ్ళవి

లోహ ప్రవాహాలను మాలుపుకొంటూ

ఘన లోహాలను మలచుకొంటూ

చెలిమి బాట వేసు కొంటూ

యంత్రాలను నియంత్రిస్తూ

రసాయనాయలను నియంత్రిస్తూ

విషవాయువులకు వేణువులూదుతూ

విద్యుద్ఘాతాల వీపు నిమురుతూ

దారి చూపు ఆ మనిషే

కార్మికుడు కష్ట జీవి

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది: ౦౭-౦౪-2009

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

atyadhbhuta pada vinyaasam,kaarmikuDu ,tana vidhi nirvahaNalo prati dinam edurkone, kashTaala kaDalilo ede vidhaanaanni kaLLaku kattinaTlu choopaaru.goppa bhaavana.

కొత్త పాళీ చెప్పారు...

మాష్టారూ, నా ఎలక్షను కబుర్లు చదివి వ్యాఖ్యా రాసినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగు ఇంతకు ముందు చూసిన గుర్తు. బహుశా ఏదన్నా వ్యాఖ్య కూడా గిలికే ఉంటాను. మీ ఫొటో మాత్రం ఇదే చూడ్డం .. కృష్ణవంశీ భారీ బడ్జెటు ఫేమిలీ సెంటిమెంటు సినిమాలో హీరోయిను ఫాదర్లా ఉన్నారు, ఆ జరీ ఉత్తరీయమూ, ఆ మీసాలూ! ఇది పొగడ్తగా అంటున్న మాటే :)
మీ పిల్లలెవరన్నా అమెరికాలో ఉండి మీరిటు విజిటుకొచ్చే ప్రణాళికేవన్నా ఉంటే, నా చెవిని ఒక ముక్క వెయ్యండి.
మరొక్క కోరిక. పెద్దవారు, అనుభవజ్ఞులు, మీ చిన్నప్పటి విశేషాలూ, ఉద్యోగ జీవిత విశేషాలూ ఏమన్నా రాయమని నా మనవి.

జయ చెప్పారు...

మీకు నూతన సంబ్వత్సర శుభాకాంక్షలండి.