22, జనవరి 2019, మంగళవారం

గప్పటి దినాల ముచ్చట్లు


గా దినాల్ల అయిదరాబాద్ ఆర్ టి సి బస్సుల మినిముం టికెట్ ఏడు పైసలే . సికింద్రాబాద్ కెళ్ళి లాలాపేట శాంతి నగర్ మినిమం పోవచ్చు. జేబిలో పైసలుంటే గుండె నిండ ధైర్యం .ఫుల్ ధైర్యంతో ధీమాగా నడుస్తున్న. మరి నా కాడ నలభై అయిదు పైసలున్నై మరి .అవనీకి నాకాడ రూపాయుండే.గానీ గా కీసర పోరడు కనపడకుంటే మంచిగనే వుంటుండే.గాడు సేయబట్టి యాభై అయిదు పైసలయిపోయినై వుత్త పున్నేనికి.గాంధీ ఆస్పతల్ మూలకఛ్చిన .ఆల్ఫా ల చాయ్ తాగాలనంటే ఎట్లైనా పది పైసళ్ళ ఆఫ్ కప్పొస్తాది .రెండు బి స్కోట్లు ఇంకో పది పైసలైతయ్.ఇంకాభీ ఎనభై పైసలుంటవి . పది పైసళ్ళ శాంతినగర్ పోవచ్చు     అనుకుంట జరా ముందుకు అడుగేసిన .ఇంతలా ఎనిక్కెల్లి     అన్నా సానది నాలాయే నిన్ను సూడబట్టి ,గిదేంది శానా బక్కగైనవ్ అనుకుంట ఎనిక్కెళ్ళి బుజం మీన సెయ్యేసిండు .తిరిగి సూద్దు ను గంద  గా కీసర పోరడు . ఎట్లున్నవ్  తమ్మి అంట మంచిగున్నర ! అవ్ తమ్మి సానదీనాలాయే సూడబట్టి అనుకుంట ...గింతల ఆల్ఫా హోటల్ తానకు జేరుంటిమి .తమ్మి చాయ్ తాగుతవ అన్నపెద్ద పైసలున్నోనిలెక్క  . తా పితే తాగుతా సార్ అన్నడు . రెండాఫ్ లు ఇరవై పైసలైతది .సరే అనుకున్న .తమ్మీ రెండు  ఆఫ్ ఛాయియ్యి బేరకి చెప్పిన చాయ్ సెక్షన్ రోడ్డుమీకి ఉండే . సారూ నాలుగు బైస్కోట్లు తెప్పియ్ .చస్తమా ఆర్దారిచ్చ్చిన .తిన్నం  తాగినం.యాభై అయిదు పైసల్ బిల్లు .అన్నా కాల్మొక్త కీసర పోనీకి పైసల్ తక్వ పడినయ్ ఓ కారణా బుడ్డ  పావలా ఉంటి య్యరాదే. .ఏంజెయ్యాలె  తీసిచ్చిన .ఆడు పోయిండు . ఇరవై పైసల్ జేబీల ఉన్నాయ్ గదా  అనుకుంట   నేను పోయి మౌలాలి బస్సు కదులుతుంటే ఎక్కినుంటి .టికెట్ టికెట్ కండక్టర్ అచ్చిండు  ఘమండు గా  జేబీల చెయ్యిపెట్టి న పైసల్ లెవ్ . ఎంత ఎడికినగాని దొరకలే .కండక్టర్ బెల్ కొట్టిండు .ఉతరో .ఉతరక జస్థనా ! ఉతరి నా . లాలాపేటదిక్కు లెఫ్ట్ రైటు . ఇంతకీ పైసలేమైనట్టూ ...సొంచాయించుకుంటా నడుస్తున్న .అయ్యా ధర్మం చెయ్యి దొ రా కాల్మొక్తా .బీచ్చ్గగా డు .బల్బు వెలిగింది . ఇరవై పైసల బిళ్ళ బీచ్చ్గానికిచ్చ్చినం గదా గాంధీ ఆస్పటాలు మూలమీ న యాద  మరిసిన. హమ్మయ్య లెక్కతేలింది .గుండె తేలికపడింది.హుషారుగా నా నడక సాగింది .